iDreamPost
android-app
ios-app

దేశంలో తొలిసారిగా ట్విట్టర్, వాట్సాప్,ఫేస్బుక్ లపై కేసు నమోదు

దేశంలో తొలిసారిగా ట్విట్టర్, వాట్సాప్,ఫేస్బుక్ లపై కేసు నమోదు

దేశంలో తొలిసారిగా ప్రధాన సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు 14 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ సైబర్ క్రైమ్ పోలీస్ లకు కేసు నమోదు చేయమని ఆర్డర్స్ జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సిసియస్ లోని సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ 374/2020 నమోదు చేసి విచారణ జరుపుతున్నారు…

వివరాల్లోకి వెళ్తే సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం సోషల్ మీడియా అప్లికేషన్లపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆమేరకు కోర్టు స్పందించి, తక్షణ విచారణ ఉత్తర్యులు జరిచేసారు. గత సంవత్సరం డిసెంబర్ 12న భారత పార్లమెంట్ లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వసవరణ చట్టానికి వ్యతిరేకంగా సదరు సోషల్ మీడియా యాప్స్ శాసనాన్ని ధిక్కరిస్తూ దేశ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నాయని శ్రీశైలం తొలుత హైదరాబాద్ నగర పోలీస్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్ మహంతిని కలసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

సోషల్ మీడియా గ్రూప్స్ లో సున్నితమైన మతపరమైన అంశాలను రెచ్చ గొడుతు, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు సోషల్ మీడియా యాప్ లైన వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లు వేదిక అవుతుందని శ్రీశైలం తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఇందుకు తార్కాణం గా కొన్నివాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ గ్రూప్ ల వివరాలను కూడా పిర్యాదులో జతచేసారు. వీటన్నిటిని పరిశీలించిన మేజిస్ట్రేట్ సైబర్ పోలీస్ లకు రిఫర్ చేశారు. దీనితో దేశంలోనే మొట్టమొదటి సారిగా సోషల్ మీడియా యాప్స్ పై కేసులు నమోదైనట్లైంది. ఈ క్రింది ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 A, 121 A, 124, 124 A, 294, 295 A, 505, 120 B, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 66A క్రింద కేసులు నమోదు కాబడ్డాయి…

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio