iDreamPost
android-app
ios-app

వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ కుమార్తె!

వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ కుమార్తె!

ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. చాలా మందికి విహార యాత్రలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. అందుకే తరచూ అడవులు, నదులు, జలపాతాలు వంటి ప్రాంతాలకు టూర్ వెళ్తుంటారు. ఇలా ఎంతో మంది విహారయాత్రలకు వెళ్తూ.. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ విహార యాత్రలు విషాదా యాత్రలుగా మారుతుంటాయి. తాజాగా ఓ కుటుంబం..టూర్ లో భాగంగా జలపాతం వద్దకు వెళ్లింది. వారి కారును జలపాతానికి అత్యంత సమీపంలో ఆపారు. ఈక్రమంలో ఉన్నట్టుండి కారు జలపాతంలోకి పడిపోయింది. అందులో కూర్చున్న తండ్రీకుమార్తె నీటిలో పడిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలో లోహియా  కుంద్ అనే జలపాతం ఉంది. నిత్యం ఈ జలపాతాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే వారాంతరంలో పర్యటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలానే ఓ భార్యాభర్తలు..తమ కుమార్తెతో కలిసి ఆదివారం సాయంత్రం కుంద్ జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడి ప్రకృతి చూస్తూ ఆ కుటుంబం తెగ ఎంజాయ్ చేసింది. అయితే జలపాతం వద్ద ఆ కుటుంబానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. వారు.. తమ కారును జలపాతానికి సమీపంలో పార్క్ చేసి ఉంచారు. ఈక్రమంలో తండ్రీకుమార్తె కారుపై కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి తరువాత కారు దానంతట అదే అకస్మాత్తుగా జలపాతంలోకి జారిపోయింది.

అందరూ చూస్తుండగానే తండ్రీ కుమార్తెలు నీటిలో పడిపోయారు. దీంతో పక్కన ఉన్న కొందరు గట్టిగా కేకలు వేశారు. మరికొందరు నీటిలోకి దూకి..తండ్రీకుమార్తెను కాపాడారు. ఆ తరువాత వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  అలానే జలపాతంలోకి కారు పడిపోవడాని స్థానికులు  వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విహారయాత్రల సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.