అన్నాచెల్లెలు, అక్క-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతిక ఈ రాఖీ పౌర్ణమి. ఈ పండగ రోజు అన్నలు, తమ్ముళ్లకు చెల్లి, అక్కలు రాఖీలు కడతారు. వారు రాఖీ కట్టినందకు సోదరుల దగ్గరి నుంచి బహుమతులు, డబ్బు తీసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఒక తమ్ముడు ఓ అక్కకి జీవితాంతం గుర్తు ఉండే బహుమతిని అందించాడు. ఎందుకంటే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అక్కకి కిడ్నీ దానం చేసి ఆమెకు పునర్జన్మను ప్రసాదించాడు. అలా తొబుట్టువు కష్టాల్లో ఉంటే ఆదుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ ఎవరా అక్కా తమ్ముడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దేశం వ్యాప్తంగా నిన్న, ఈరోజు రక్షా బంధన్ పండుగను గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. రాఖీ పండుగ సందర్భంగా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బాధ పడుతున్నఅక్కకి తమ్ముడు కిడ్నీని గిఫ్ట్ గా ఇచ్చాడు. హైదరాబాద్ కు చెందిన ధుష్యంత్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి శీతల్ అనే అక్క ఉన్నారు. ఆమె కొంతకాలంగా కిడ్ని సమస్యతో బాధ పడుతున్నారు. వైద్యులను సంప్రదించగా.. కిడ్ని మార్చాలని సూచించారు. అంతేకాక కిడ్నీ సంబంధిత సమస్యల వల్ల శీతల్ తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కిడ్నీ పూర్తిగా క్షీణించడంతో మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో దుష్యంతే.. తన అక్కడ బాధను చూడలేకడ పోయాడు. ఆమెకు కిడ్ని సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అక్కకు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. రాఖీ పండుగకు అక్కకు కిడ్నీ గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడుగా చరిత్రలో నిలిచిపోయాడు. రాఖీ పండుగకు కిడ్నీని గిఫ్ట్ గా ఇచ్చిన.. తనకు పునర్జన్మ ఇచ్చాడని శీతల్ అన్నారు. తన అక్క బాధను చూడలేక పోయానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని దుష్యంత్ తెలిపాడు.
తోబుట్టువులు సంతోషంగా ఉంటేనే.. మనకు హాయిగా ఉంటుందని, వారు బాధ పడుతుంటే సంతోషంగా ఎలా ఉండగలమని దుష్యంత్ అన్నాడు. ఎవరైన రాఖీకి గిఫ్ట్ గా చీరలు, నగలు ఇస్తారు. ధనవంతులు అయితే స్థలాలు గిఫ్ట్ గా ఇస్తుంటారు. కానీ ఈ తమ్ముడు మాత్రం..అక్కడు కొత్త జీవితాన్నిప్రసాదించాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు, నెటిజన్లు సోదరుడివి అంటే నువ్వు బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ బంగారు తమ్ముడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.