iDreamPost
android-app
ios-app

ముహూర్తం టైంకి బట్టతల బయటపడటంతో.. పెళ్లి వద్దన్న వధువు..

  • Published May 23, 2022 | 6:13 PM Updated Updated May 23, 2022 | 6:13 PM
  • Published May 23, 2022 | 6:13 PMUpdated May 23, 2022 | 6:13 PM
ముహూర్తం టైంకి బట్టతల బయటపడటంతో.. పెళ్లి వద్దన్న వధువు..

ఇటీవల అమ్మాయిలు పెళ్లి కొడుకులో ఏదో ఒక చిన్న లోపం ఉన్నా, నచ్చకపోయినా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు పెళ్ళికొడుకు ఇంట్లో లేకపోయినా, లేక వాళ్ళు ఎవర్నైనా ప్రేమించినా ఇలా రకరకాల కారణాలతో పీటల మీద పెళ్లిళ్లు కూడా ఆపేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి బట్టతల ఉందన్న విషయం తెలియడంతో పీటల మీదే పెళ్లి ఆపేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచాడు. అయితే పెళ్లి సమయంలో మండపానికి వస్తుండగా, కళ్ళు తిరిగి అబ్బాయి కింద పడ్డాడు. దీంతో తలకు ఉన్న విగ్గు ఊడిపోయింది. ఇది చూసి కల్యాణ మండపంలో ఉన్న వారంతా షాకయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు బట్టతల ఉన్న వ్యక్తితో పెళ్లి వద్దని ఖరాకండిగా చెప్పేసింది. పెళ్లి పెద్దలు, పంచాయతీ పెద్దలు, పోలీసులు ఆ అమ్మాయికి నచ్చచెప్పాలని చూసినా నో చెప్పింది. అంతే కాక ఇది దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసాడు అంటూ పంచాయితీ పెట్టింది. చివరికి ఆ ఊరి పెద్ద మనుషుల మధ్య పంచాయితీలో పెళ్లి రద్దు చేసి పెళ్లి కోసం అమ్మాయి తల్లితండ్రులు ఖర్చు చేసిన రూ.5.6 లక్షలు కూడా వరుడు కుటుంబం తిరిగి ఇవ్వాలని తీర్మానం చేయడంతో అబ్బాయి తరపు వారు చేసేదేమి లేక అంగీకరించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom