iDreamPost
android-app
ios-app

డ్రగ్స్ తీసుకొని దొరికిపోయిన బాలీవుడ్ నటుడు.. మరోసారి బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం..

  • Published Jun 13, 2022 | 6:34 PM Updated Updated Jun 13, 2022 | 6:34 PM
  • Published Jun 13, 2022 | 6:34 PMUpdated Jun 13, 2022 | 6:34 PM
డ్రగ్స్ తీసుకొని దొరికిపోయిన బాలీవుడ్ నటుడు.. మరోసారి బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం..

గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ని డ్రగ్స్ కేసులు వీడట్లేదు. ఒకరి తర్వాత ఒకరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతూనే ఉన్నారు. ఇటీవలే షారుఖ్ తనయుడు కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు ఎవర్ని పట్టుకుంటారో, ఎప్పుడు ఎవర్ని విచారణకి పిలుస్తారో అని బాలీవుడ్ జనాలు భయపడుతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు.

ఆదివారం రాత్రి బెంగళూరులో ఓ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకి సమాచారం రావడంతో పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అందులో డ్రగ్స్‌ తీసుకున్నట్టు అనుమానిస్తున్న వారి రక్త నమూనాలను పరీక్షలకు పంపగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ ఆరుగురిలో ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు, నటుడు సిద్దాంత్ కపూర్ కూడా ఉన్నాడు. దీంతో సిద్దాంత్ కపూర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఆరుగురు వ్యక్తులు హోటల్‌లో డ్రగ్స్ సేవించారా లేదా పార్టీకి వచ్చే ముందే డ్రగ్స్ తీసుకొని వచ్చారా అనే విషయాన్ని విచారిస్తున్నారు. సిద్దాంత్ కపూర్ కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. అంతే కాక పలు సినిమాలకి దర్శకత్వ శాఖలో కూడా పని చేశాడు. సిద్దాంత్ కపూర్ డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అవ్వడంతో మరోసారి బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం చెలరేగింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom