iDreamPost
android-app
ios-app

మాడరన్ భీష్ముడి ప్రేమ కథ

  • Published Jan 16, 2020 | 4:27 AM Updated Updated Jan 16, 2020 | 4:27 AM
  • Published Jan 16, 2020 | 4:27 AMUpdated Jan 16, 2020 | 4:27 AM
మాడరన్ భీష్ముడి ప్రేమ కథ

మనకు భీష్మ అనగానే గుర్తొచ్చేది తెల్లబడిన ఒత్తైన జుట్టు వృద్ధాప్యం నిండిన దేహంతో ఉండే మహాభారత గాధలోని యోధుడు. సినిమాల్లో టీవీ సీరియల్స్ లో అలాగే చూడటం అలవాటు కావడంతో భీష్మ యూత్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఎవరికి క్లారిటీ లేదు. అది కనుక్కోవడం జరిగే పని కాదు కాని నితిన్ రూపంలో మాడరన్ భీష్ముడు రాబోతున్నాడు. ఛలోతో డెబ్యుతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన్న జంటగా రూపొందుతున్న భీష్మ వచ్చే నెల విడుదల కాబోతోంది. ఇవాళ దీని టీజర్ ని విడుదల చేశారు. 

చాలా సరదాగా సాగిన ఈ నిమిషంన్నర వీడియోలో నితిన్ క్యారెక్టర్ ని రివీల్ చేశారు. సోషల్ మీడియాలో మేమ్స్ తయారు చేస్తూ అమ్మాయిల దగ్గర వేర్వేరుగా హై ప్రొఫైల్ జాబులు చేస్తున్నట్టుగా తిరిగే యువకుడు భీష్మ. తన చుట్టూ ఉన్నవాళ్ళకు మాటల్లో చేతల్లో ఎన్నో పజిల్స్ విసిరే ఇతని లైఫ్ లోకి ఓ అందమైన అమ్మాయి(రష్మిక మందన్న )వస్తుంది. అక్కడి నుంచి ఈ కుర్రాడి లైఫ్ కొత్త మలుపులు తిరుగుతుంది. అవేంటో తెలియాలంటే వేచి చూడాలి.

మొత్తానికి నితిన్ వరస పరాజయాల తర్వాత మంచి ఎంటర్ టైనర్ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నితిన్ ఇప్పటికే సుమారు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్నారు. 2019లో ఒక్క సినిమా విడుదల కాలేదు. శ్రీనివాస కళ్యాణం ఇచ్చిన స్ట్రోక్ కి తనకు ఎలాంటి కథలు సూట్ అవుతాయో గుర్తించి దానికి తగ్గట్టే భీష్మను సెలెక్ట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. టీజర్ లోనే చాలా పంచులు ఉన్నాయి. చాలా  కాలం తర్వాత కన్నడ సుప్రసిద్ధ నటులు దర్శకులు అనంత్ నాగ్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయడం విశేషం. ఎక్కువ రివీల్ చేయలేదు కాని ఇందులో ఏదో క్రైమ్ యాంగిల్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom