iDreamPost
android-app
ios-app

విడాకులు తరువాత జీవితం చాలా అద్భుతంగా ఉంది: బిల్‌గేట్స్ మాజీ భార్య!

  • Published Jun 20, 2024 | 1:00 PM Updated Updated Jun 20, 2024 | 1:00 PM

తాజాగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య తమ విడాకులపై మొదటిసారిగా స్పందించింది. కాగా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విడాకులపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాజాగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య తమ విడాకులపై మొదటిసారిగా స్పందించింది. కాగా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విడాకులపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • Published Jun 20, 2024 | 1:00 PMUpdated Jun 20, 2024 | 1:00 PM
విడాకులు తరువాత జీవితం చాలా అద్భుతంగా ఉంది: బిల్‌గేట్స్ మాజీ భార్య!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిలిగేట్స్ గురించి అందరికి తెలిసిందే. ప్రపంచంలో అతి బిలినియర్ కుబేరుల్లో బిల్ గేట్స్ కూడా ఒకరు. అయితే గత మూడేళ్ల క్రితం బిలిగేట్స్ తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిలిగేట్స్ అతని భార్య మిలిందా ఫ్రెంచ్ తో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటిలో వీరి విడాకులు అందర్నీ షాక్ గురి చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్ ఈ దంపతులు ఇలా విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.అయితే తాజాగా ఈ విడాకుల గురించి బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా మొదటిసారి స్పందించారు. పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య తమ విడాకులపై మొదటిసారిగా స్పందించింది. కాగా, ఎంతో అన్యోన్యంగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా ఈ దంపతులు తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. కాగా, వీరిద్దరూ గత మూడేళ్ల క్రితం అనగా.. 2021లో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తొలిసారి విడాకులపై మిలిండ్ ఫ్రెంచ్ గేట్స్ బహిరంగంగా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా మిలిండ్.. విడాకులు న జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. అయితే, అంతకు ముందే చాలా కాలం నుంచి గేట్స్‌కు దూరంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అయితే కేవలం పిల్లల సంరక్షణ సహా ఇతర బాధ్యతలను సమతౌల్యం చేసుకుంటూ అత్యంత క్లిష్టమైన అంశాన్ని సమర్థంగా దాటగలిగానని మిలిండా అభిప్రాయపడ్డారు.

Milinda gates

ఇక విడాకులు తన జీవితంలో జరిగిన‘బాధాకరమైన విషయమని, కానీ విడాకుల తర్వాత తన జీవితం చాలా అద్భుతంగా సాగుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తన పనులను తాను చేసుకుంటున్నానని, ఓ సాధారణ వ్యక్తిలా ఇరుగుపొరుగు వారితో కలిసి ఉంటున్నా.. సూపర్ మార్కెట్ కు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడం,నచ్చినప్పుడు రెస్టారెంట్ కు వెళ్లి తినడం ఇలా చిన్న చిన్న పనులతో ఆనందంగా గడుపుతున్నా అని ఆమె తెలిపారు. అయితే విడాకుల సమయంలో మాత్రం జీవితంలో ఎలా ముందుకెళ్లాలి? పిల్లల పరిస్థితేంటి? ఫౌండేషన్‌ బాగోగులెలా? అని తన మనసంతా ఈ ఆలోచనలతోనే నిండిపోయేదాన్ని అని చెప్పుకొచ్చారు. అయితే వాటి కోసమే ఎక్కువ ఆలోచించే తాను ఇప్పుడు అవన్నీ సాఫీగా జరుగుతున్నాయని భారం దిగిపోయినట్లుగా ఉందని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఇందుకు భగవంతుడికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నానని అన్నారు.కాగా, ఒప్పందం ప్రకారం గేట్స్ ఫౌండేషన్ నుంచి ఇటీవలే మిలిండా బయటకొచ్చారు. సొంతంగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే మహిళల సాధికారత, వారి హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం ఇటీవలే బిలియన్‌ డాలర్ల నిధిని ఆమె ప్రకటించారు. ఇకపోతే.. అత్యంత చిన్నవయసులోనే మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన బిల్‌గేట్స్‌.. ఆ సంస్థకు సీఈవోగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్‌ మేనేజరుగా 1987లో చేరిన మిలిండా.. అప్పట్లో ఆ సంస్థలో చేరిన ఏకైక ఎంబీఏ మహిళా గ్రాడ్యుయేట్ కావడం విశేషం. ఆ తర్వాత ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడటంతో 1994లో వివాహం చేసుకోగా.. వీరికి ముగ్గురు సంతానం. కానీ, లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌కు సంబంధాలే విడాకులకు కారణమని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş