iDreamPost
android-app
ios-app

రాముడు నా కల్లోకి వచ్చి అలా చేయోద్దన్నారు..! బిహార్ మంత్రి

రాముడు నా కల్లోకి వచ్చి అలా చేయోద్దన్నారు..! బిహార్ మంత్రి

ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంటారు. అంతేకాక అధికారులకు చెప్పి.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఇలా ప్రజల సమస్యలను తెలుసుకుంటా కొందరు వార్తల్లో నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా రాముడు తన కలలోకి వచ్చాడంటూ బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి అన్నారు. మార్కెట్లో తనను విక్రయించకుండా చూడమని రాముడు కోరినట్లు ఆ మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బిహార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గతంలో కూడా పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి ఆయన రాముడుకి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. బిహార్ లోని రాంపుర్ గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  వారి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి వివరించాడు. అనంతరం దేశంలోని కుల వ్యవస్థ, మత విశ్వాసాలు,చారిత్రక వ్యక్తుల గురించి మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పంద వ్యాఖ్యలు చేశారు. రాముడు  సైతం శబరి ఎంగిలి చేసిన ఆహారాన్ని తిన్నాడని. కానీ, నేటికీ శబరి కుమారుడికి ఆలయ ప్రవేశం నిషిద్ధమే.

రాష్ట్రపతి, సీఎంని కూడా ఆలయాలను సందర్శించకుండా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. దేవాలయాలను గంగాజలంతో శుద్ధి చేశారని, దేవుడే శబరి ఇచ్చిన ఆహారం తిన్నాడని, కుల వ్యవస్థ పట్ల ఆ భగవంతుడు కూడా అసంతృప్తి చెందాడని మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ‘రాముడు నా కలలోకి వచ్చాడు. ప్రజలు తనను మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పాడు. అలా జరగకుండా నన్ను రక్షించమని కోరాడు” అని మంత్రి అన్నారు. గతంలో కూడా రామాయణాన్ని పొటాషియం సైనేడ్ తో పోల్చడం వివాదాస్పదమైంది. కుల వివక్షపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దూషణలకు దిగారని, మరికొందరు భౌతిక దాడులకు పాల్పడతామని బెదరిస్తున్నారని ఆయన తెలిపారు. మరి..బిహార్ మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి