iDreamPost
iDreamPost
రాష్ట్ర విద్యాశాఖ జోక్యంతో ఓ విద్యార్థిని ఇప్పుడు రెండు కాళ్లతో నడవగలుగుతోంది. బీహార్ లోని ఫతేపూర్ కు చెందిన సీమా కుమారి అనే 10 ఏళ్ల విద్యార్థిని రెండేళ్ల క్రితం ట్రాక్టర్ చక్రాల కింద పడి ఎడమకాలిని కోల్పోయింది. కాలు పోయిందని కుంగిపోకుండా.. చదువుకోవాలన్న తపనతో.. టీచర్ అవ్వాలన్న ధ్యేయంతో ఒంటికాలితోనే స్కూలికి గెంతుతూ వెళ్తోంది. ఇంటి నుంచి స్కూలికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రతిరోజూ స్కూలికి వెళ్లేందుకు సీమా లాంగ్ జంప్ టెక్నిక్ ను ఉపయోగిస్తుంది. సీమా ఒంటికాలితో స్కూలికి వెళ్తోన్న వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.
ఆ వీడియో సోనూసూద్ సహా.. ప్రముఖుల దృష్టికి చేరింది. వారి సహాయంతో.. బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్‌లోని భాగల్‌పూర్ యూనిట్ రెండు రోజుల్లోనే కృత్రిమ అవయవాన్ని తయారు చేసి సీమాకు అమర్చారు. 10 ఏళ్ల సీమా ఇప్పుడు స్కూల్ కు వెళ్లేందుకు గెంతాల్సిన అవసరం లేదు. కృత్రిమ కాలి సహాయంతో.. తను రెండు కాళ్లతో నడవగలదు.
ఈ సందర్భంగా సీమా మాట్లాడుతూ.. “నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాన్న వలస కూలీ. అమమ్ ఊళ్లో ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తుంది. మా కుటుంబంలో నేను బాగా చదువుకుని టీచర్ కావాలన్నది నా ఆశయం. తద్వారా తర్వాతి తరం విద్యార్థులకు నేను పాఠాలు చెప్పొచ్చు.” అని పేర్కొంది.
https://twitter.com/SonuSood/status/1529365148359532544