iDreamPost
android-app
ios-app

అంతుచిక్కని రహస్యం.. ప్రతి ఏటా ఎత్తు పెరుగుతున్న శివలింగం.. ఎక్కడంటే!

  • Published Jun 21, 2023 | 3:28 PM Updated Updated Jun 21, 2023 | 3:28 PM
  • Published Jun 21, 2023 | 3:28 PMUpdated Jun 21, 2023 | 3:28 PM
అంతుచిక్కని రహస్యం.. ప్రతి ఏటా ఎత్తు పెరుగుతున్న శివలింగం.. ఎక్కడంటే!

శాస్త్ర సాంకేతికతలో అమోఘమైన ప్రగతి సాధిస్తున్నాం. భూమండలం మీదనే కాక.. ఏకంగా విశ్వంలో ఏమేం రహస్యాలు ఉన్నాయో తెలుసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. ఇన్ని చేస్తున్నా.. సాంకేతికతలో ఎంతో వృద్ధి సాధించినా సరే.. నేటికి కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నాం. కొన్ని వింతలు.. అవి ఎందుకు ఏర్పడుతున్నాయి.. వాటి వెనక రహస్యాలు ఏంటి అనే దాన్ని గుర్తించడం ఏ టెక్నాలజీ వల్ల అవ్వడం లేదు. అలాంటి వింతల్లో ఒకదాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మన దగ్గర కాణిపాకం వినాయకుడు.. ప్రతి ఏటా పెరుగుతున్నాడు అని తెలుసు కదా. ఇదిగో ఇలానే ఓ చోట బొజ్జ గణపయ్య తండ్రి శివయ్య ప్రతి రూపం అయిన శివ లింగం.. ప్రతి ఏటా ఎత్తు పెరుగుతూ.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈ వింత ఎక్కడ అంటే..

ఈ ఆలయంలో శివలింగం ఎత్తు పెరగడం మాత్రమే కాక.. ఇక్కడ నీటినిన తాగితే.. రోగాలు నయమవుతాయని జనాల నమ్ముతారు. మరి ఈ మహిమ గల శివలింగం ఎక్కడ ఉంది అంటే.. బిహార్‌, భోజ్‌పూర్ జిల్లాలోని అరా నగరంలో ఉన్న అతిపురాతనమైన శైవక్షేత్రాల్లో బుద్వా మహాదేవ్ శివాలయం ఒకటి. ఇక్కడి శివలింగం ప్రతిసంవత్సరం ఎత్తు పెరుగుతుందని అక్కడ పూజలు చేసే మహంతీ(అర్చకులు)చెబుతున్నారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది.. ఈ స్వామిని దర్శించి.. ఆయనను అభిషేకించిన నీటిని తీర్థంగా తీసుకుంటే చర్యవ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం. పైగా ఈ శివాలయం మహాభారత కాలం నాటిదని.. పాండవులు వనవాస సమయంలో ఇక్కడ శివుడికి పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక భోజ్‌రాజు కూడా ఇక్కడ పూజలు నిర్వహించాడని సమాచారం.

పూర్వం ఈ బుద్వా మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగం చాలా చిన్నదిగా ఉండేదట. అయితే కాలంతో పాటు.. ఆ శివలింగం ఎత్తు పెరుగుతుందని మహంతీలు చెబుతున్నారు. అలా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తు 4 అడుగుల కంటే ఎక్కువగా ఉందన్నారు. శివలింగం ఇలా ఎత్తు పెరగడంపై అనేక మంది పరిశోధనలు చేశారు.. కానీ ఆ రహస్యం మాత్రం కనుక్కోలేకపోయారు. ప్రతి రోజు వందల మంది ఆలయానికి వస్తారని.. కానీ కార్తీక మాసం, శివరాత్రి పర్వదినాల్లో.. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారని.. అప్పుడు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది అంట.

నీరు తాగితే వ్యాధులు తగ్గుతాయి..

బిహార్‌లోని బుద్వా మహాదేవ్ శివాలయం ఎంతో శక్తివంతమైందని భక్తులు విశ్వసిస్తారు. తమ పూర్వీకులు చాలా మంది ఇక్కడ మహంతులుగా (పూజారులుగా) ఉన్నారని ఆలయంలో ఉన్న పూజారి మహంత్ అజిత్ మిశ్రా చెప్పారు. తమ వంశస్థులు మొదటి నుండి శివయ్యకు సేవ చేస్తున్నామని మిశ్రా తెలిపారు. వారు ఇక్కడ పూజలు చేస్తున్న దగ్గరి నుంచి శివలింగం ఎత్తు, మందం పెరగడాన్ని గమనించామన్నారు. చర్మవ్యాధులు, తెల్లమచ్చలు (తెల్లపొడ) ఉన్న వారు ఇక్కడికి వచ్చి స్వామికి అభిషేకం చేసి .. శివుడికి నివేదించిన నీటిని తీర్థంగా తీసుకోవడమే కాక.. ఆ నీటిని శరీరంపై చల్లుకుంటే.. ఆ వ్యాధుల నుంచి కోలుకుంటారని వందల ఏళ్లుగా భక్తలు నమ్ముతున్నారు.

ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర..

బిహార్‌లోని ఈ బుద్వా మహాదేవ్ శివాలయానికి వందల ఏళ్ల నాటి పురాతనమైనది. ఈ ఆలయాన్ని ఎప్పుడు, ఎవరు నిర్మించారు.. అనే దానికి సంబంధించి.. ఏ పురాణాల్లో కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ ఇక్కడ ఉన్న శివలింగం తయారు చేసిన రాయిని బట్టి మాత్రం పాండవుల వనవాసం చేసిన కాలం నాటిదని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.