iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ ఫేమ్‌ కౌశల్‌ తండ్రికి అనారోగ్యం.. వీడియో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌

  • Published Aug 29, 2023 | 1:57 PMUpdated Aug 29, 2023 | 1:57 PM
  • Published Aug 29, 2023 | 1:57 PMUpdated Aug 29, 2023 | 1:57 PM
బిగ్‌బాస్‌ ఫేమ్‌ కౌశల్‌ తండ్రికి అనారోగ్యం.. వీడియో షేర్‌ చేస్తూ ఎమోషనల్‌

బిగ్‌బాస్‌ ఫేమ్‌ కౌశల్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ ఉందో.. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. అదే రేంజ్‌లో విమర్శలు కూడా ఎదుర్కొంటుంటాడు. బిగ్‌బాస్‌ కన్నా ముందు కౌశల్‌.. పలు టీవీ సీరియల్స్‌లో నటించాడు. మోడలింగ్‌ కూడా చేశాడు. ఇక బిగ్‌బాస్‌ షో సెకండ్‌ సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు కౌశల్‌. అప్పటి నుంచి అతని పాపులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం పలు షోలు, సీరియల్స్‌లో నటిస్తూ.. బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన జనాలు.. ఏమైంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తన తండ్రి ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్న వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు కౌశల్‌. దాంతో పాటు ‘‘తల్లిదండ్రులను బాగా చూసుకొండి.. వారు మనల్ని ప్రేమించిన దాని కన్నా ఎక్కువగా ప్రేమించండి.. మా నాన్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నవారందరికి ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చాడు. ఇంతకు తన తండ్రికి ఏమయ్యింది.. ఎందుకు ఆస్పత్రిలో చేర్పించారో మాత్రం చెప్పలేదు కౌశల్‌. కానీ వీడియోలో కౌశల్‌ తండ్రిని చూస్తే.. ఆయనకు ఏదో తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు అర్థం అవుతోంది. దాంతో కౌశల్‌ అభిమానులు.. ఆయన తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

కౌశల్ తండ్రి సుందరయ్య నటుడు. ఆయనకు బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. సుందరయ్య.. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో ఎన్నో భిన్నమైన పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఆయన ఇలా ఆస్పత్రిలో ఉండటం చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుందరయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kaushal Manda (@kaushalmanda)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి