iDreamPost
android-app
ios-app

Bigg Boss పక్కా ప్లాన్.. సీజన్ 7కు అంతా రెడీ! హౌస్ లోకి వెళ్లేది వీళ్లే?

  • Author Soma Sekhar Published - 12:06 PM, Tue - 20 June 23
  • Author Soma Sekhar Published - 12:06 PM, Tue - 20 June 23
Bigg Boss పక్కా ప్లాన్.. సీజన్ 7కు అంతా రెడీ! హౌస్ లోకి వెళ్లేది వీళ్లే?

బుల్లితెరపై ఎన్నో రియాలీటి షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ వాటిల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయి. అలా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది బిగ్ బాస్ షో. వరుసగా 5 సీజన్లు టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయిన ఈ షో 6వ సీజన్లో మాత్రం డీలాపడిపోయింది. దాంతో 7వ సీజన్ కు పక్కా ప్లాన్ తో రాబోతున్నాడు బిగ్ బాస్. పేరున్న స్టార్స్ ను తీసుకొచ్చే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందని సమాచారం. ఇక సీజన్ 7లో పాల్గొనబోయే వారి లిస్ట్ కూడా రడీ అయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 7.. బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి త్వరలోనే ముందుకు రాబోతోంది. గత సీజన్ రేటింగ్ లో అట్టర్ ఫ్లాప్ కావడంతో.. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ రేటింగ్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడంట బిగ్ బాస్. దాంతో కాస్త లేట్ అయినా గానీ స్టార్స్ ను, కొత్త కొత్త టాస్క్ లను రూపొందించే పనిలో బిగ్ బాస్ టీమ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ షోలో పలు కీలక మార్పులు చేయనున్నారు అన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. హోస్ట్ గా నాగార్జున ఉంటారా? లేక గతంలో వినిపించిన పేర్లు అయిన బాలకృష్ణ, రానా మరికొంత మంది నటులను తీసుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. అదీకాక షో పాపులారిటీని పెంచడానికి హౌస్ లోకి వివాదాస్పద వ్యక్తులను, డైవర్స్ తీసుకున్న జంటలను తీసుకురానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక బిగ్ బాస్ 7 హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ కొన్ని పేర్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. యాంకర్ దీపికా పిల్లి, సీరియల్ నటుడు అమర్ దీప్ దంపతులు, యూట్యూబర్ నిఖిల, సింగర్ హేమ చంద్ర, నటి ఐశ్వర్య, నటి మిత్రా శర్మ, డ్యాన్సర్ శ్వేత నాయుడు, నటి శోభ శెట్టి, తన్మయి, మోడల్ సాయి రోనక్ పేర్లు ప్రముఖంగావ వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా సింగర్ మోహన భోగరాజు, యాంకర్ రష్మి, న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మంగ్లీ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ లు ఈసారి బిగ్ బాస్ 7లోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. మరి ఈ లిస్ట్ తో ఏ మేరకు బిగ్ బాస్ రేటింగ్ సాధిస్తాడో వేచి చూడాలి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş