iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ పల్లెటూరు – హౌస్ మేట్స్ హుషారు

  • Published Nov 05, 2020 | 6:17 AM Updated Updated Nov 05, 2020 | 6:17 AM
బిగ్ బాస్ పల్లెటూరు – హౌస్ మేట్స్ హుషారు

ఇంకో రెండు రోజుల్లో నామినేషన్ ప్రక్రియ రాబోతోంది కాబట్టి దానికి తగ్గట్టే బిగ్ బాస్ హౌస్ లో హంగామా క్రమంగా పెరుగుతోంది గత రెండు మూడు రోజులుగా అర్థం లేని గొడవలు ఓవర్ యాక్షన్లతో విసుగు తెప్పించి చిరాకు పుట్టించిన సభ్యుల వల్ల ఎంటర్ టైన్మెంట్ తగ్గిపోయి డ్రామా ఎక్కువవుతోందని గుర్తించిన నిర్వాహకులు దానికి తగ్గట్టే రిపేర్లు చేసే పనిలో పడ్డారు. అయితే ప్రేమకథల సాగతీత మాత్రం అలాగే కొనసాగుతోంది. ఊహించని విధంగా అఖిల్ తనను నామినేట్ చేయడంతో మొన్న భోరున ఏడ్చిన మోనాల్ ని అభిజిత్ సోఫా మీద కూర్చోబెట్టి ఓదార్చాడు. కాసేపు అవసరం లేని ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లతో టైం పాస్ చేశారు ఇద్దరు.

ఇక కొత్త టాస్కులో భాగంగా హౌస్ ని పల్లెటూరిగా మార్చారు. సోహైల్ ని గ్రామపెద్దగా చేసి లాస్యకు అతనికి భార్య పాత్ర ఇచ్చారు. అరియానా వీళ్ళ కూతురు. ఊళ్ళో ఉన్న అబ్బాయిల కన్ను ఈమె మీదే ఉంటుంది. అమ్మ రాజశేఖర్ కష్టపడే వ్యక్తిగా రోల్ ఇస్తూనే లాస్యకు లైన్ వేసే చిలిపి పనిని కూడా అప్పజెప్పారు. అఖిల్ ని బాద్యత లేని యువకుడిగా గ్రామపెద్దను ఎదిరించే వాడిగా చూపించారు. అభిజిత్-మోనాల్ లను వంటోళ్ళుగా మార్చి దాన్ని అమ్ముకునే కాన్సెప్ట్ పెట్టారు. హారిక పుకార్లు పుట్టించే అమ్మాయిగా పాన్ షాప్ యజమాని అవినాష్ తమ్ముడు మెహబూబ్ ని ప్రేమలో పడేసే పనిని అప్పజెప్పాడు బిగ్ బాస్.

అంతేకాదు హౌస్ మేట్స్ కి తెలియకుండా మూడు పనులు చేయడం ద్వారా సీక్రెట్ మర్డర్ టాస్క్ కూడా ఇచ్చాడు. మాములుగానే ఓవర్ యాక్టివ్ గా ఉండే హారిక దీని దెబ్బకు ఇంకా రెచ్చిపోయింది. ఎవరికి వారు మాములుగా జీవించలేదు. అమ్మ రాజశేఖర్ గుండు మీద కాఫీ పోయడం లాంటివి హారిక చాలా తెలివిగా మేనేజ్ చేసింది. మెహబూబ్ కూడా ఆస్కార్ వచ్చే స్థాయిలో చేశాడు. మొత్తానికి విలేజ్ డ్రామాలో ఎవరికెవరు తక్కువ లేరు అనే రీతిలో నడిపించారు. కాకపోతే శృతి మించడం కాస్త తగ్గినట్టే అనిపించినా దీన్ని ప్రత్యేకంగా ఇష్టపడే అభిమానులకు మాత్రం వాళ్ళు కోరుకున్న ఎంటర్ టైన్మెంట్ దక్కుతోంది

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişcasibomgalabet güncel girişJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet