iDreamPost
android-app
ios-app

కట్టలు తెగిన ఆక్రోశం – సొహైల్ అరియనా ఆవేశం

  • Published Dec 10, 2020 | 5:58 AM Updated Updated Dec 10, 2020 | 5:58 AM
కట్టలు తెగిన ఆక్రోశం – సొహైల్ అరియనా ఆవేశం

ఫినాలేకు రోజులు దగ్గర పడే కొద్దీ టాస్కుల పేరుతో సభ్యుల మధ్య ఎంత చిచ్చు పెట్టొచ్చో అంతా చేస్తున్నాడు బిగ్ బాస్. ఇది లైఫ్ టైం లో ఒకసారి వచ్చే అవకాశం కావడంతో పార్టిసిపెంట్స్ సైతం నువ్వా నేనా అనే రేంజ్ లో డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. చివరి ఘట్టానికి ఇంకో పది రోజుల కన్నా తక్కువ సమయం ఉండటంతో నాటకీయత పెరుగుతోంది. దానికి తోడు ఎలిమినేషన్ కోసం కావాల్సిన నామినేషన్ ప్రక్రియను ఇకపై ప్రేక్షకులే చూసుకుంటారని మొన్న తేల్చి చెప్పడంతో వీలైనంత ఓవర్ ఎమోషన్స్ తో ఎవరికి వారు తమ పెర్ఫార్మన్స్ కి మించి అవుట్ ఫుట్ ఇస్తున్నారు. అరియనా అందరినీ మించి ఇంకా చెప్పాలంటే మోనాల్ ని దాటే స్థాయిలో కన్నీటి వరద పారిస్తోంది.

రోబో టాస్కుని కంటిన్యూ చేయడంలో భాగంగా సోహైల్ ఓపికను ప్రశ్నించే క్రమంలో హౌస్ మేట్స్ నానా ఎత్తుగడలు వేశారు. నీళ్లలో బొమ్మ వేయడం గురించి అరియనా ఓ రేంజ్ లో అతగాడిని కడిగేసింది. భారీ డైలాగులతో విరుచుకుపడింది. అయితే సొహైల్ టాస్క్ అయ్యేదాకా సైలెంట్ గానే ఉండి అది పూర్తయ్యాక బాబు మాములుగా రెచ్చిపోలేదు. అరియనాని కొట్టబోయేంత పని చేశాడు. ఒకరినొకరు గట్టిగా తిట్టేసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో అఖిల్ అభిజిత్ లు కలగజేసుకుని సొహైల్ ని వాష్ రూమ్ వైపు తీసుకెళ్లి కూల్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి కొంత పర్వాలేదు అనిపించింది.

స్టోరీ అక్కడికి అయిపోలేదు. అరియనా బోరున వర్షం కురిసే స్థాయిలో ఏడుపులు పెడబొబ్బలు మొదలుపెట్టి బిగ్ బాస్ ను నిలదీసింది. నా తప్పు ఏంటని అడిగింది. అభిజిత్ వచ్చి ఓదార్పు ఇచ్చి నీళ్లు తాగించే దాకా ఇదే తంతు. నిజానికి అరియనా ఓవర్ చేసిందనుకున్నా సొహైల్ కూడా అంతకు మించే చేశాడు. మైనస్ అవుతుందని తెలిసినా ఇంత కంట్రోల్ తప్పడం ఏమిటో అంతు చిక్కలేదు. విచిత్రంగా ఓపిక టాస్కులో సొహైల్ విజేత అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తో వివరణ చెబుతూ మళ్ళీ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి మాతృదేవోభవ సినిమాని ప్రదర్శించినట్టు జరిగింది ఎపిసోడ్. ఇవాళ ఏకాగ్రత టాస్కు పేరుతో ఇంకెంత రచ్చ చేస్తారో.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş