iDreamPost
android-app
ios-app

హౌసులో మాజీల సందడి – మాటలతో హడావిడి

  • Published Dec 16, 2020 | 6:32 AM Updated Updated Dec 16, 2020 | 6:32 AM
హౌసులో మాజీల సందడి – మాటలతో హడావిడి

వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆఖరి పోరాటానికి రెడీ అయ్యింది. విన్నర్ పేరు గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతున్నప్పటికీ శనివారం దాకా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిన్న 101 ఎపిసోడ్లో మాజీ పార్టిసిపెంట్స్ ని పిలిచి హంగామా చేయించారు. హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజాలు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పుకున్నారు. ఇప్పటి సభ్యులతో మాట్లాడుతూ వాళ్లకు టాస్కులు ఇచ్చే బాధ్యత వీళ్లపై పడింది. ముందు జరిగిన సిరీస్ లతో ఇప్పటి సీజన్ 4ని పోలుస్తూ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మొదటి సీజన్ లో అసలు ఫుడ్డే సరిగ్గా ఇవ్వలేదని శ్రీముఖి చెప్పింది.

అసలు ఏం చేస్తున్నారని మీకు చికెన్లు మటన్లు ఇవ్వాలని గట్టిగానే నిలదీశారు మాజీలు. మీకేమో మిక్సర్లు గ్రైండర్లు ఇచ్చారని మాకు మాత్రం స్వంతంగా దంచుకునే పనిని కల్పించారని సరదాగా చెప్పుకున్నారు. ఈ చర్చల్లో అరియనా పెర్ఫార్మన్స్, మోనాల్ ప్రేమకథలు, అఖిల్ పులిహోర రాజా వేషాలు అన్ని టాపిక్స్ వచ్చాయి. ఇలా డిస్కషన్ కొనసాగుతుండగానే తమ గురించి వచ్చినప్పుడు హౌస్ మేట్స్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పటిలాగే మితిమీరిన భావోద్వేగాలకు తావు ఇవ్వకుండా అందరూ బాలన్స్ మైంటైన్ చేశారు. బహుశా వచ్చిన గెస్టుల మీద గౌరవం కాబోలు.

ఇక నాలుగే రోజుల్లో బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే రాబోతోంది. హారిక, అరియనా, అభిజిత్, అఖిల్, సొహైల్ లలో విజేత ఎవరు అనే దాని గురించి సోషల్ మీడియాలో, ఆన్ లైన్ లో పెద్ద చర్చే జరుగుతోంది. అందరి దృష్టి ఓటింగ్ మీదే ఉంది కానీ అది ఎంతవరకు సీరియస్ గా పరిగణనలోకి తీసుకుంటారనేది వేచి చూడాలి. ట్రెండ్ ని బట్టి చూస్తే ఈసారి కూడా మేల్ పార్టిసిపెంట్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అరియనా కొంత వెనుకబడిందనే చెప్పాలి. రేస్ లో అందరి కంటే అభిజిత్ ముందున్నట్టు పోల్స్ చెబుతున్నాయి. మరి ఏదైనా ఊహించని ట్విస్టులు ఏమైనా చోటు చేసుకుంటాయేమో చూడాలి

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet giriş