iDreamPost
android-app
ios-app

క్లాసులు తీసుకున్న నాగ్ – హాట్ గా మారిన హౌస్

  • Published Nov 29, 2020 | 5:02 AM Updated Updated Nov 29, 2020 | 5:02 AM
క్లాసులు తీసుకున్న నాగ్ – హాట్ గా మారిన హౌస్

వీకెండ్ రాగానే అందరి దృష్టి ఎలిమినేషన్ల మీద ఉండటంతో పాటు నాగార్జున యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది కాబట్టి దానికి తగ్గట్టే రేటింగ్స్ కూడా శని ఆదివారాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. ఫినాలే ముహూర్తం దగ్గర పడుతోంది కనక బిగ్ బాస్ హౌస్ వాతావరణం కూడా క్రమంగా వేడెక్కుతోంది. ఈ వారం ఎవరూ బయటికి వెళ్లే ఛాన్స్ లేనట్టే. వైల్డ్ కార్డు ఎంట్రీలు లేవని సమాచారం. బెస్ట్ కెప్టెన్ గా ఎంచుకోబడిన హారికకు నాగ్ తనదైన శైలిలో క్లాస్ తీసుకుని స్ట్రోక్ ఇచ్చారు. కన్ఫెషన్ రూమ్ లోకి తనను పిలిపించి ముందుగా తను చేసిన మంచినే చెప్పామన్నారు. అదంతా ఓపిగ్గా విని ఆ తర్వాత అసలైన ఝలక్ ఇచ్చారు.

గతంలో అభిజిత్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే వారించకపోగా హారిక కూడా పోటీపడి ఆ బాషలోనే బదులు చెప్పే వీడియో క్లిప్ ని ప్రదర్శించారు. అభిజిత్ టాస్కు చేయనని మొండికేసినప్పుడు అది చేసేలా ప్రోత్సహించకుండా హారిక తప్పు చేసిందని క్లారిటీ ఇచ్చారు నాగ్. అయితే హారిక మోనాల్ ను సాకుగా చెప్పుకుంది. దీన్ని ముందే పసిగట్టిన బిగ్ బాస్ దాని కోసం కూడా ఓ వీడియో సిద్ధం చేసి ఉంచారు. గతంలో మోనాల్ తల్లి వచ్చి ఆమెను ఏడిపించడం గురించి అడిగితే తాను దాక్కుంటానని అభిజిత్ చెప్పడం అందులో చూపించారు. అభిజిత్ తరఫున వకాల్తా పుచ్చుకోవడం పట్ల హారికకు నాగ్ చేతిలో గట్టి అక్షింతలే పడ్డాయి. హారిక ఏడ్చేసింది.

ఇక అభిజిత్ అఖిల్ ల మధ్య గొడవకు మరోసారి బిగ్ బాస్ వేదికైంది. డైనింగ్ టేబుల్ వద్ద చైర్లను తన్నే దాకా వెళ్ళింది వ్యవహారం. చర్చ చాలా హాట్ హాట్ గా సాగింది. ఫైనల్ లిస్ట్ లో ఇద్దరూ ఉండటం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. నాగార్జున టాస్కులను చూపించాక అభిజిత్ చేసిన తప్పులను చూపించారు. అయితే అతను ఎమోషనల్ అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా ప్రూఫ్స్ తో సహా పట్టించేశారు. ఇక ఈ రోజు ఈగ విలన్ కిచ్చ సుదీప్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ఎవరిని పంపకపోవడం దాదాపు ఖరారైనప్పటికీ ఏదైనా ట్విస్టు ఇస్తారేమో చూడాలి

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş