iDreamPost
android-app
ios-app

సెలవు తీసుకున్న మోనాల్ – ఇక ఫైనల్ హల్చల్

  • Published Dec 14, 2020 | 4:55 AM Updated Updated Dec 14, 2020 | 4:55 AM
సెలవు తీసుకున్న మోనాల్ – ఇక ఫైనల్ హల్చల్

మూడు నెలలకు పైగా బిగ్ బాస్ హౌస్ ని తన కన్నీళ్లతో ముంచెత్తిన మోనాల్ ఎట్టకేలకు ఫైనల్ కు సరిగ్గా వారం ముందు ఎలిమినేట్ అయ్యి సెలవు తీసుకుంది. తన పెర్ఫార్మన్స్ మీద మధ్య మధ్యలో సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ నిర్వాహకులు తనను ఇక్కడి దాకా తీసుకురావడానికే మొగ్గు చూపారు. ఓట్ల ప్రాతిపదికన జరిగిందని నాగ్ ముందు నుంచి చెబుతూ వస్తున్నప్పటికీ లోగుట్టు పెరుమాళ్ళకెరుక తరహాలో ప్రేక్షకులు అలా చూస్తుండిపోయారు. అయితే ఇన్నాళ్లు అధిక భాగం ఏడుస్తూ గడిపిన మోనాల్ నిన్న మాత్రం ఎక్కువ సేపు నవ్వుతు ఉండటం విశేషం. ఎమోషనల్ కూడా అయ్యింది.

కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నాగార్జున సండే ఎపిసోడ్ కూడా తన ప్రెజెన్స్ తో కలర్ ఫుల్ కోటింగ్ ఇచ్చారు. మోనాల్ ఎలిమినేషన్ ని స్పెషల్ గా డిజైన్ చేశారు. కాకపోతే ఎప్పటిలాగే నాటకీయత అనిపించింది కానీ ఇది అలవాటైన బిగ్ బాస్ అభిమానులకు ఇందులో వింతేమీ అనిపించదు. అరియనా, మోనాల్ లలో ఒకరు ముందు బయటికి వెళ్తారని నాగ్ ప్రకటించారు. స్టేజి మీదకు ఒక ప్రింటర్ ను తెప్పించి ఫైనలిస్ట్ ఫోటో అందులో వస్తుందని చెప్పారు. ఒక్కసారిగా ఫలితం తెలియగానే అరియనా భావోద్వేగం తట్టుకోలేక కుప్పకూలిపోయింది. వెంటనే సోహైల్, అభిజిత్ ఓదార్చారు.

ఇక ఎప్పటిలాగే ఎలిమినేట్ అయిన మోనాల్ తో ఇతర సభ్యులకు సలహాలు సూచనలు ఇప్పించారు. అన్నింటిలోకి అఖిల్ ఉండిపోరాదే పాట పడుతుండగా మోనాల్ ఆనంద బాష్పాలు కురిపించడం హైలైట్ అయ్యింది. ఇక మిగిలిన వాళ్లలో అఖిల్, అభిజిత్, సొహైల్, అరియనా, హారికలు ఫైనల్ టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు. ఈ ఆరు రోజులు చాలా కీలకంగా మారబోతోంది. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే టెలికాస్ట్ ఉంటుంది. శనివారమే చిత్రీకరిస్తారు కాబట్టి అదే రోజు విన్నర్ పేరు లీకయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వంద రోజుల గేమ్ షోకు ఇక తెరపడనుంది.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibom