iDreamPost
android-app
ios-app

వీడియోలతో ఫ్లాష్ బ్యాకులు – హౌసులో ఎమోషన్లు

  • Published Dec 17, 2020 | 5:39 AM Updated Updated Dec 17, 2020 | 5:39 AM
వీడియోలతో ఫ్లాష్ బ్యాకులు – హౌసులో ఎమోషన్లు

బిగ్ బాస్ 4 ఫినాలే కౌంట్ డౌన్ నాలుగు రోజుల్లో ముగియనుంది. విజేత ఎవరనే దాని గురించి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ ఫైనల్ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ శనివారం అయ్యాక కానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా నిన్న 102వ ఘటాన్ని ఎమోషనల్ గా మార్చేశారు. టైం మెషిన్ లోకి వెనక్కు తీసుకెళ్లి అలా ఫ్లాష్ బ్యాక్ లు చూపించారు. ముందుగా అఖిల్ వంతు వచ్చింది. బిగ్ బాస్ తన గురించి చెప్పిన కామెంటరీ చాలా పాజిటివ్ గా సాగింది. ఆఖర్లో ఇష్టమైన ఫోటోని తీసుకుని వెళ్ళామని చెప్పగా ఫినాలే మెడల్ వచ్చిన ఛాయాచిత్రాన్ని అందుకుని హౌస్ లోకి వెళ్ళాడు.

నెక్స్ట్ వంతు అభిజిత్ కు వచ్చింది. ఏకంగా మెచ్యూర్డ్ మ్యాన్ అఫ్ ది హౌస్ బిరుదును దక్కించుకున్నాడు. యంగ్ ఛార్మింగ్ బాయ్ అనే పేరు కూడా అందుకున్నాడు. ఇక్కడ చేసిన జర్నీలో ఎన్నో నేర్చుకున్నానని అభిజిత్ చెప్పుకున్నాడు. బిగ్ బాస్ కూడా గట్టిగానే మెచ్చుకున్నాడు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలకడగా ఉండటం పట్ల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత తన జర్నీని వీడియో రూపంలో ప్లే చేసి చూపించారు. ఒకరకంగా చెప్పాలంటే బయట ప్రచారం జరుగుతున్నట్టు అభిజిత్ ని ఈ రేంజ్ లో మెచ్చుకోవడం చూస్తే ఆదివారం జరగబోయే దానికి క్లూ ఇచ్చినట్టు అనిపిస్తుంది.

ఆ తర్వాత ఇదే తరహాలో హారిక, సొహైల్, అరియనాలకు కూడా వీడియోలు చూపిస్తూ వాళ్ళ వ్యక్తిత్వం తాలూకు ఫీడ్ బ్యాక్ ఇస్తూ ముగించారు బిగ్ బాస్. శనివారం దాకా రోజుకో తరహాలో ఇలాగే కొనసాగించబోతున్నట్టు కనిపిస్తోంది. టాస్కులు డ్రామా ఇకపై ఉండే అవకాశాలు లేనట్టే. ఈ మూడు రోజులు చాలా కీలకం కాబట్టి హౌస్ మేట్స్ టెన్షన్ గా ఫీలవుతున్న మాట వాస్తవం. మరోవైపు మొన్న బయటికి వెళ్లిన మోనాల్ వరస ఇంటర్వ్యూలతో ఛానల్స్ ని హోరెత్తిస్తోంది. అయితే ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఎవరు వస్తారనే దాని గురించి మాత్రం ఇంకా గుట్టు వీడలేదు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి వచ్చే ఛాన్స్ లేనట్టే. మరి ఎవరు వస్తారో

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis giriş