iDreamPost
android-app
ios-app

చివరి వారంలో బిగ్ బాస్ – సాగిపోయిన అర్హత టాస్క్

  • Published Dec 15, 2020 | 6:29 AM Updated Updated Dec 15, 2020 | 6:29 AM
చివరి వారంలో బిగ్ బాస్ – సాగిపోయిన అర్హత టాస్క్

సరిగ్గా ఇంకో ఆరు రోజుల్లో శుభం కార్డు వేసుకోబోతున్న బిగ్ బాస్ 4 ఫినాలే రేస్ కోసం అందరూ యథాశక్తి తమ పెర్ఫార్మన్స్ లకు మెరుగులు పెడుతున్నారు. మోనాల్ మొన్న సెలవు తీసుకోవడంతో కథ కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. ఇక ఏది చేసినా ఈ వారం రోజుల్లోనే చేయాలనే వాస్తవం సభ్యులకు బాగా తెలుసు. అందుకే నవరసాలను మరోసారి బయటికి తెచ్చే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. నిన్న అఖిల్ కెమెరాల ముందు మోనాల్ లేని లోటు గురించి చెప్పుకుంటూ మాములుగా జీవించలేదు. నిజ జీవితంలో ప్రేమికులు కూడా ఇంత డెప్త్ గా ఫీల్ కారేమో. తెగబాధపడిపోయిన ఎక్స్ ప్రెషన్లు భీకరంగా ఇచ్చేశాడు.

అక్కడితో ఈ ముచ్చట అయిపోలేదు. హారిక దగ్గరికి వెళ్లి తన గోడును చెప్పుకున్నాడు. పిచ్చి లేస్తుంది కొట్టాలి అనిపిస్తుందని చెబుతూ ఏదేదో మాట్లాడాడు. హారిక ఓదార్చినా అంత సులభంగా తగ్గలేదు. అసలు ప్రస్తావన తేవాల్సిన అవసరం లేని మోనాల్ గురించి అంత డిస్కషన్ ఏమిటో అతనికే తెలియాలి. పైగా విరహాన్ని ఈ రేంజ్ లో పండించడం చూస్తే మోనాల్ స్టూడియో దగ్గరకు వచ్చి ధర్నా చేస్తుందేమో. తర్వాత కాసేపు ముసుగు కాన్సెప్ట్ తో టైం పాస్ చేయించాడు బిగ్ బాస్. మనిషి మనసులో ఒకలా బయట ఇంకోలా ఉంటాడనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని పెట్టాడు. ఓ మోస్తరుగా వెళ్లిపోయింది.

కొత్తగా చేయించడానికి ఇంకేమి తట్టలేదు కాబోలు బిగ్ బాస్ మళ్ళీ హౌస్ మేట్స్ మధ్య మరోసారి రచ్చకు తెరతీశాడు. ప్రతి ఒక్కరు తాము ఎందుకు విన్నర్ కు అర్హతో చెబుతూ మరొకరిని ఎందుకు అర్హులు కారో వివరించాలని కండిషన్ పెట్టాడు. ఎవరికి వారు తమ తమ వెర్షన్లు చెప్పుకున్నారు. అయితే ముగ్గురు తననే టార్గెట్ చేయడంతో అరియనా ఫైర్ అయ్యింది. కాసేపు హారికకు తనకు మధ్య డ్రామా నడిచింది. ఫైనల్ గా వీళ్ళే ఈ టాస్కులో అనర్హులుగా మిగలడం అసలు ట్విస్ట్. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో గత సీజన్ పార్టిసిపెంట్స్ వచ్చి సందడి చేయబోతున్నారు. ప్రోమోని కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు..

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş