iDreamPost
android-app
ios-app

ఎలిమినేటర్ల ప్రవేశం – ఫినాలే ముందు వినోదం

  • Published Dec 19, 2020 | 5:50 AM Updated Updated Dec 19, 2020 | 5:50 AM
ఎలిమినేటర్ల ప్రవేశం – ఫినాలే ముందు వినోదం

రేపటితో బిగ్ బాస్ 4 కథ కంచికి వెళ్లబోతోంది. గత వారమే ఎలిమినేషన్లు పూర్తయ్యాయి కాబట్టి ఈ ఆరు రోజులను ఏదోరకంగా టైం పాస్ చేయిస్తున్న నిర్వాహకులు నాటకీయతను బాగా తగ్గించేసి సరదాగా సాగేలా ప్లాన్ చేసుకున్నారు. మరీ గొప్పగా లేనప్పటికీ ఈ షోని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ మాత్రం టార్గెట్ కు తగ్గట్టు దక్కుతోంది. నిన్నటి ఎపిసోడ్లో అందరికీ టి షర్ట్స్ ఇచ్చి ఒకరి చొక్కా మీద మరొకరు కామెంట్స్ రాయాలని చెప్పాడు బిగ్ బాస్. హారిక అయితే ఏకంగా ముద్దును ముద్రగా అఖిల్ షర్ట్ మీద వేసి ఫ్యూచర్ పార్ట్నర్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇక్కడ కొంచెం శృతి మించినట్టే అనిపించింది.

గత మూడు సీజన్ల తరహాలోనే ఈసారి కూడా మొత్తం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకొచ్చారు. ముందుగా మోనాల్ కే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఆమె రాకను గుర్తించిన అఖిల్ ఆత్రంగా సొహైల్ ను వెంటపెట్టుకుని అద్దాల వద్దకు పరుగులు పెట్టాడు. దానికి న్యాయం చేస్తూ మోనాల్ మిర్రర్ నుంచే హగ్గులు కిస్సులు గుప్పించింది. హారిక, మోనాల్ ల డ్రెస్సులు మాత్రం ఫామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడేలా ఉన్నాయి. ఏదో గ్లామర్ కోటింగ్ కోసం కావాలని వేయించారో ఏమో అర్థం కాలేదు. అఖిల్ మోనాల్ ఇద్దరూ దూరమయ్యాక తాము నిద్రలేని రాత్రుళ్ళు ఎలా గడుపుతున్నామో చెప్పుకుని ఓదార్చుకున్నారు.

నెక్స్ట్ వచ్చిన కరాటే కళ్యాణి ఎమోషనల్ అయ్యింది. లాస్య ఇంటికి వెళ్ళిపోయాక అన్నం సరిగా సహించడం లేదని చెప్పింది. ఈ ఇద్దరూ హౌస్ మేట్స్ సరదాగా ఆటలు ఆడించారు. ఇందులో భాగంగానే అఖిల్ తలపై ఐసు నీళ్లు పోసుకోవడం జరిగింది. స్వాతి దీక్షిత్, కుమార్ సాయిలు కూడా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా కుమార్ సాయి పులిహోర కాన్సెప్ట్ ని తీసుకొచ్చి అఖిల్ ని ర్యాగింగ్ చేసినంత పని చేశాడు. తర్వాత అందరిని పొగుడుతూ సెలెబ్రిటీలంటూ మెచ్చుకున్నాడు. ఇవాళ మిగిలిన గంగవ్వ, నోయెల్, సుజాత, మెహబూబ్, దివి, అవినాష్ లు రాబోతున్నారు. ఈ రోజు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş