కరోనా నియంత్రణకు శాంతి యాగం

కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి యాగం చేయిస్తున్నాడు. పద్మావతీపురంలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలైన ఈ యాగం నాలుగు గంటలుగా నిరాఘాటంగా సాగుతోంది. సుమారు మరో గంటపాటు యాగం జరుగుతుందని వేదపండితులు చెప్పారు. 110 మంది వేదపండితుల ఆధ్వర్యంలో లోకాపద నివారణార్ధం ’శ్రీనివాస అద్భుత శాంతి యాగం’ జరుగుతోంది.

ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ అనేక వన మూలికలను సేకరించి చేస్తున్నట్లు చెప్పారు. వనమూలికలను ఈ యాగంలోని హోమగుండంలో వేసి వెలిగించటం వల్ల వచ్చే పొగవల్ల క్రిములు నశిస్తాయని పండితులు చెప్పారు. కరోనా వైరస్ అనేది కూడా కంటికి కనిపించని ఓ క్రిమే కాబట్టి దాన్ని నాశనం చేయటానికే ఎంఎల్ఏ ఇంట్లో లోకాపద నివారణార్ధం ఈ యాగం చేస్తున్నట్లు పండితులు చెప్పారు.

మొత్తం మీద ఎంఎల్ఏగా ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణకు జనాల్లో ఒకవైపు సామాజిక చైతన్య కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే సమయంలో లోకకల్యాణం కోసం యాజ్ఞయాగాలు కూడా చేయిస్తున్నాడు. ఎంఎల్ఏ హోదాలో తిరుపతిలో తిరుగుతూ ట్రాఫిక్ నియంత్రణ పాటించమని, సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించకుండా రోడ్లపైకి రావద్దని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతూ పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడుస్తున్న విషయం అందరు చూస్తున్నదే. మొత్తానికి ప్రజా ప్రతినిధిగా భూమన చాలామందికి స్పూర్తిగా నిలుస్తున్నాడనటంలో సందేహమే లేదు.

Show comments