iDreamPost
android-app
ios-app

గంజి తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

  • Published Jun 18, 2022 | 7:00 AM Updated Updated Jun 18, 2022 | 7:00 AM
గంజి తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ప్రస్తుతం అందరూ కుక్కర్ లోనే అన్నం వండుతున్నారు. కాబట్టి గంజి ఎవరు తయారు చెయ్యట్లేదు మరియు వాడట్లేదు. కానీ గతంలో అందరూ పొయ్యి మీద అన్నం వంగినప్పుడు గంజిని వార్చేవారు. ఆ గంజితో రకరకాల పానీయాలు తయారు చేసి తాగేవారు. గంజిలో అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, ఎమినో ఆమ్లాలు, కార్బోహైడ్రాట్స్ ఉన్నాయి. కాబట్టి గంజిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

గంజి తయారీ విధానం:-
*గంజి కావాలంటే అన్నాన్ని కుక్కర్ లో కాకుండా విడిగా వండాలి. అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీరే గంజి. దీనికి కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు.
*అరకప్పు బియ్యానికి మూడు కప్పుల నీటిని కలిపి ఉడికించాలి అపుడు అది జావలా తయారవుతుంది దీనిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగవచ్చు.
*గంజిని ఏదైనా పచ్చడి లేదా ఉల్లిపాయతో కలిపి తాగవచ్చు.

గంజి వలన కలిగే లాభాలు:-
*మోషన్స్ అయినపుడు గంజిని తాగితే మనకు నీరసం తగ్గుతుంది.
*వాంతులు, జ్వరం తగ్గించడానికి గంజి ఉపయోగపడుతుంది.
*గంజి మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్లో ఉంచుతుంది.
*కడుపులో మంటను గంజి తగ్గిస్తుంది.
*గంజిలో ఉండే కార్బోహైడ్రాట్స్ శరీరానికి తొందరగా శక్తిని అందిస్తాయి.
*గంజి జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
*గంజి డయేరియాను కూడా తగ్గిస్తుంది.
*గంజి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది.
*గంజిని తలకు పట్టిస్తే అది జుట్టు రాలడాన్ని తగ్గించి పొడవుగా పెరిగేలా, పట్టులా మెరిసేలా చేస్తుంది.
*గంజి చర్మ వ్యాధులను తగ్గించి చర్మం మృదువుగా, యవ్వనంగా కనబడేలా చేస్తుంది.
*గంజి మన ముఖంపై ముడతలు తగ్గేలా చేస్తుంది.
*నీటిలో కొద్దిగా గంజి నీరు కలిపి స్నానం చేస్తే రోజూ ఉత్సాహంగా ఉంటారు.
*గంజి తాగడం వల్ల మన శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అందుకే రోజు వారి ఆహారంలో గంజిని భాగంగా తీసుకుంటే అన్ని రకాలుగా మంచిది.