iDreamPost
iDreamPost
ధ్యానం అనేది ఏ వయసు వారికైనా బాగా ఉపయోగపడుతుంది. ధ్యానం రోజుకు రెండు సార్లు చేయవచ్చు. ఉదయం లేచిన వెంటనే మరియు రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయొచ్చు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి మన మనసులోకి ఎటువంటి ఆలోచనలు రాకుండా చేయడమే. ధ్యానం కనీసం రోజుకు ఇరవై నిముషాలు చేస్తే మంచిది. ఈరోజుల్లో చాలా మంది పనులలో స్ట్రెస్ కి గురవుతున్నారు. ధ్యానం అనేది స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ధ్యానం మన మనసును ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంచుతుంది.
అలాగా యోగా కూడా ఎంతో మంచిది. యోగాసనాలు రోజూ చేయడం వలన కీళ్ల నొప్పులు తగ్గి కండరాలు బలంగా తయారవుతాయి. యోగ రోజూ చేస్తే రక్తప్రసరణను మెరుగు పరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వెన్ను నొప్పి తగ్గడానికి యోగాసనాలు బాగా ఉపయోగపడతాయి. యోగాసనాల వలన బరువు కూడా తగ్గుతారు. యోగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా యోగాసనాలు ఉపయోగపడతాయి.
ధ్యానం మరియు యోగా రోజూ చేయడం వలన నిద్ర బాగా పడుతుంది. మనకు కలిగే చిరాకు, ఆందోళనను తగ్గిస్తాయి. వయసు పెరుగుతున్నవారిలో, పిల్లలలో జ్ఞాపకశక్తి మెరుగవడానికి కూడా యోగా మరియు ధ్యానం ఉపయోగపడతాయి. ధ్యానం మరియు యోగా మనం చేయడానికి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు అనుకూలమైనవి. ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఇలా రోజూ యోగా, ధ్యానం చేస్తే చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండొచ్చు.