iDreamPost
iDreamPost
మంగళవారం చెస్టర్-లీ-స్ట్రీట్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు.
ఈ యేడాది ప్రారంభంలో స్టోక్స్‌ను ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. కాని మూడు ఫార్మెట్లకు తగ్గట్టుగా ఆడటం కష్టమని, ఒక్కరే మూడు అన్ని ఫార్మెట్స్ లోనూ ఆడితే, ఇతర ఆటగాళ్లకు అవకాశాలను అడ్డుకుంటున్నట్లు భావించానని చెప్పాడు.
ఈ సమ్మర్ సీజన్ లో ఇంగ్లండ్ తరుపున స్టోక్స్ ఆరు ODIలు ఆడవలసి ఉంది. వర్క్ మేనేజ్మెంట్ లో భాగంగా, ఇండియా, దక్షిణాఫ్రికాలతో T20I లకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే హండ్రెడ్ టోర్నమెంట్ కు కూడా దూరమైయ్యాడు. మూడు ఫార్మెట్లకు బదులు టెస్ట్ లు, టీ20లకే పరిమితం కావాలని బెన్ డిసైడ్ అయ్యాడు. ఆ మేరకు వన్డేలకు గుడ్ బై చెప్పాడు.
2011లో ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన బెన్ స్టోక్స్, అతని లోకల్ గ్రౌండ్ రివర్‌సైడ్‌లో మంగళవారం చివరి ఓన్డేను ఆడుతున్నాడు. ODI కెరీర్ లో అతనికిది 105వ గేమ్. మొత్తం 74 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో ఛాంపియన్ ఆల్ రౌండర్ లా ఆడాడు. 39.44 యావరేజ్ సాధించాడు. 95.26 స్ట్రయిక్ రేట్. 2019లో వోల్డ్ కప్ ఫైనల్ ఓవర్లో, ఆ తర్వాత సూపర్ ఓవర్ లో మొత్తంమీద 84 పరుగులతో, ఇంగ్లాండ్ కు కప్ ను సాధించడం అతని వన్డే కెరీర్ కే హైలెట్.