iDreamPost
android-app
ios-app

తాళి కట్టాల్సిన సమయంలో అందరికీ షాక్‌ ఇచ్చి వరుడు!

  • Published Jan 02, 2024 | 6:07 PM Updated Updated Jan 02, 2024 | 6:07 PM

వరుడు చేసిన పనికి పెళ్లి కూతురి తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. అతడికి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతడు వినలేదు. తన వికృత బుద్ధి విడిచి పెట్టలేదు.

వరుడు చేసిన పనికి పెళ్లి కూతురి తల్లిదండ్రులు షాక్‌ అయ్యారు. అతడికి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతడు వినలేదు. తన వికృత బుద్ధి విడిచి పెట్టలేదు.

  • Published Jan 02, 2024 | 6:07 PMUpdated Jan 02, 2024 | 6:07 PM
తాళి కట్టాల్సిన సమయంలో అందరికీ షాక్‌ ఇచ్చి వరుడు!

పెళ్లికి వచ్చిన వారితో ఆ ప్రాంతం మొత్తం కలకలలాడుతోంది. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు తరపు బంధువులు ముచ్చట్లలో మునిగిపోయారు. తాళికట్టే శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. అయితే, పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టాల్సిన వరుడు అందరికీ షాక్‌ ఇచ్చాడు. వధువు మెడలో తాళి కట్టనని తెగేసి చెప్పాడు. అతడు ఎందుకలా మెండిపట్టు పట్టుకుని కూర్చున్నాడో అందరికీ అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అసలు విషయం అర్థం కాగానే అందరూ షాక్‌ అయ్యారు.

కేవలం చెప్పినంత కట్నం  ఇవ్వలేదని వధువు మెడలో తాళి కట్టనంటూ భీష్మించుకు కూర్చున్నాడు వరుడు. దీంతో గొడవ మొదలైంది. చివరకు పోలీస్‌ స్టేషన్‌కు కూడా సమాచారం వెళ్లింది. వరుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా, హళ హుబ్బలి గ్రామానికి చెందిన సచిన్‌ పాటిల్‌ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది.

డిసెంబర్‌ 30న నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. వరుడికి 100 గ్రాముల బంగారం, 10 లక్షల డబ్బు ఇస్తామని ఆమె తల్లిదండ్రులు మాటిచ్చారు. పెళ్లి వేడుక జరగాల్సిన సమయం రానే వచ్చింది. పెళ్లి వేడుకలో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టాల్సిన సమయం రానే వచ్చింది. అయితే, వరుడు మాత్రం అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఇస్తానన్న కట్నం ఇచ్చేంత వరకు తాళి కట్టనని తెగేసి చెప్పాడు. పెళ్లికి వచ్చిన ఇరు వర్గాల వారు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా అతడు వినలేదు.

డబ్బు ఇచ్చేంత వరకు తాళి కట్టనన్నాడు. దీంతో పెళ్లి కూతురు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సచిన్‌పై కేసు నమోదు చేశారు. వరకట్నం కేసు మీద అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. సచిన్‌ గురించి తెలుసుకుంటున్న జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో కూడా వరకట్నం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేసి ఉంటే ఆ యువతి జీవితం నాశనం అయ్యేదని అంటున్నారు. పెద్దలు పెళ్లి చేసే ముందు వరుడి గుణ, గణాల గురించి ఒకటికి రెండు సార్లు ఆరా తీయాలని సూచిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş