iDreamPost
iDreamPost
సమ్మర్ లో బీర్ తాగాలనీ అనుకొనే వారికి షాక్ తగులనుంది. రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఎండ కాలంలో బీర్ల అమ్మకాలు రికార్డ్ సృష్టించాయి. ఈయేడాది సేల్స్ రికార్డులను బద్ధలుకొట్టాయి. హైదరాబాద్ లో అధిక సంఖ్యలో బీర్ల అమ్మకాలు సాగాయి. ఇప్పుడు ఈ బీర్ల రేట్లు పెంచాలని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్టు సమాచారం. బీర్ల ధరలను పెంచాలని గత కొంతకాలంగా డిస్టలరీల కోరుతున్న వేళ, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో బీర్ ధరను 10-20 రూపాయల మేర పెంచాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే ఉత్తర్వులు వెలువడితే లైట్ బీర్ 140 ఉంటే అది రూ.150 కానుంది. అదే స్ట్రాంగ్ బీర్ విషయానికి వస్తే రూ.150 ఉంటే 170గా ఉండనుంది.