iDreamPost
android-app
ios-app

వీడియో: బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త.. లేకుంటే ఇదే పరిస్థితి

  • Published Oct 03, 2023 | 12:22 PM Updated Updated Oct 03, 2023 | 1:11 PM
  • Published Oct 03, 2023 | 12:22 PMUpdated Oct 03, 2023 | 1:11 PM
వీడియో: బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త.. లేకుంటే ఇదే పరిస్థితి

దొంగలు రోజు రోజుకు మరింత తెలివి మీరిపోతున్నారు. కేవలం రాత్రుల్లో కాదూ.. పట్టపగలు కూడా జేబులు ఖాళీ చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో అయితే.. గప్ చుప్‌గా కొట్టేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాప్ వంటి ప్రాంతాల్లో చెప్పనక్కర్లేదు. బస్సుల్లో, రైళ్లల్లో రద్దీ సమయాల్లో దొంగలు వారి చేతులకు పని చెబుతుంటారు. దొంగలున్నారు జాగ్రత్త, మీ వస్తువులకు మీరే భాద్యులు అంటూ ప్రకటనలు వినిపిస్తూనే ఉన్నా.. వాటిని విని మరింత పకడ్బందీగా చోరీకి పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. రద్దీగా ఉన్న బస్సులో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు నటించి.. ఓ వ్యక్తి పర్సును చాక చక్యంగా కొట్టేశాడో దొంగ. ఈ ఘటన కర్ణాటకలో జరిగినట్లుగా వీడియోలో కనిపిస్తున్న బస్సును బట్టి తెలుస్తోంది.

ఆ వీడియోలో ఓ బస్సు ఆగగానే.. ఎక్కేందుకు జనాలు ఎగబడుతున్నారు. తోసుకుంటూ ఎక్కుతున్నారు. అందులో ఉన్న దొంగ.. ఓ వ్యక్తి వెనకాలే ఉంటూ.. బస్సు ఎక్కుతున్నట్లు లైన్‌లో నిలబడ్డాడు. బస్సు ఎక్కే ప్రయత్నంలో తోపులాట జరుగుతుండగా.. ఎదురుగా ఉన్నవ్యక్తి ఫ్యాంటు జేబులో చేయి పెట్టి పర్సును మెల్లిగా తీసుకుని.. ఆ తర్వాత తన జేబులో పెట్టేసుకున్నాడు దొంగ. అయితే ఈ మొత్తాన్ని ఓ పిల్లవాడు చూస్తుండటం మనకు వీడియోలో కనిపిస్తుంది. చిటికెలో జరిగిపోయిందీ ఇదంతా.  చివరకు ఆ వ్యక్తి బస్సు ఎక్కకుండా జనాల నుండి పక్కకు వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇంత టాలెంట్ గా ఉన్నాడని, మీ దుంపలు తెగ ఇలా ఉన్నారేంట్రా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by iDream News (@idream_news)

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom