iDreamPost
iDreamPost
కథలో విషయం లేకపోయినా తన బాడీ లాంగ్వేజ్, స్పూఫ్స్ తో ఇప్పటిదాకా కమర్షియల్ సేఫ్ సక్సెస్ అందుకున్న సంపూర్ణేష్ బాబు కొత్త సినిమా బజార్ రౌడీ నిన్న థియేటర్లలో విడుదలయ్యింది. ప్రత్యేకంగా ఓపెనింగ్స్ తెచ్చే స్థాయి లేనప్పటికీ తనను ఇష్టపడే ప్రేక్షకులు సెపరేట్ గా కొందరున్నారు. దానికి తోడు మౌత్ టాక్ ఆధారంగా కొంత పాజిటివ్ గా టాక్ వచ్చినా చాలు పెట్టిన బడ్జెట్ కి నిర్మాతలకు పెట్టుబడి గ్యారెంటీ ఉండటంతో రెగ్యులర్ గా సంపూ మూవీస్ వస్తూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు హీరోగా నటించిన పాత టైటిల్ ఇది. మరి కాసిన్ని అంచనాలు కూడా అందుకునేలా ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం”
ఇది 1970 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా వచ్చిన ఎన్నో కమర్షియల్ బ్లాక్ బస్టర్ల నుంచి కొన్ని కొన్ని పాయింట్లు తీసుకుని కలగాపులగం మిక్సీ చేసి రాసుకున్న కథ. అతడులో పార్ధు క్యారెక్టర్ టైపు లో కాళీ(సంపూ) చిన్నప్పుడే తండ్రికి భయపడి ఇల్లు వదిలి పారిపోతాడు. జస్ట్ గబ్బర్ సింగ్ లాగా. ఓ బస్తీ వాళ్ళు చేరదీసి అక్కడే పెంచి పెద్ద చేస్తారు. మంచి బుద్దులు నేర్పిస్తారా అంటే అదీ లేదు. పక్కా బజార్ రౌడీ మాదిరి తయారు చేస్తారు. కట్ చేస్తే కాళీ ఆస్తి కోసం స్కెచ్ చేసిన విలన్లు ఇతన్నే పావుగా వాడుకునేందుకు ప్లాన్ వేస్తారు. అక్కడి నుంచి పాత ఎన్టీఆర్ సినిమాల తాలూకు రెఫరెన్సులు ఎన్నో వస్తాయో లెక్క చెప్పడం కష్టం.
సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ పరంగా తన నుంచి దర్శకుడు ఏ అతి అయితే కోరుకున్నాడో దాన్ని సంపూర్ణంగా ఇచ్చేశాడు. అక్కడక్కడా తన మార్కు కొబ్బరిమట్ట తరహా మేనరిజమ్స్ ఉన్నప్పటికి అవుట్ డేటెడ్ రైటింగ్ తో సినిమా మొత్తం నాసిరకంగా తయారయ్యింది. కామెడీ కూడా అధిక శాతం పండలేదు. చాలా సన్నివేశాలు సిల్లీగా ఉంటాయి. దీనికే ప్రేక్షకులు ఎగబడి నవ్వుతారని రచయిత ఓవర్ కాన్ఫిడెన్స్ కాబోలు. దర్శకుడు వసంత నాగేశ్వర్ రావు జీవితానికి ఈ ఒక్క సినిమా చాలానే స్థాయిలో మరీ పేలవంగా తీశారు. సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోకపోవడం ఉత్తమం. సినిమా పరువుని బజారుకు తీసుకురావడం తప్ప ఈ రౌడీ చేసిందేమి లేదు
Also Read : శాటిలైట్ పోటీ – హక్కుల కోసం కోట్లే కోట్లు