iDreamPost
android-app
ios-app

Mizoram: యాంకర్ టూ అసెంబ్లీ స్పీకర్.. అక్కడ తొలి మహిళగా చరిత్ర..!

  • Published Mar 09, 2024 | 6:10 PMUpdated Mar 09, 2024 | 6:10 PM

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా మిజోరాం రాజకీయాల్లో ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. తొలిసారి మిజోరాం రాష్ట్ర అసెంబ్లీలో ఓ మహిళ స్పీకర్ గా ఎంపికయ్యారు.

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్బంగా మిజోరాం రాజకీయాల్లో ఓ అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. తొలిసారి మిజోరాం రాష్ట్ర అసెంబ్లీలో ఓ మహిళ స్పీకర్ గా ఎంపికయ్యారు.

  • Published Mar 09, 2024 | 6:10 PMUpdated Mar 09, 2024 | 6:10 PM
Mizoram: యాంకర్ టూ అసెంబ్లీ స్పీకర్.. అక్కడ తొలి మహిళగా చరిత్ర..!

ఇప్పటివరకు మిజోరాం రాజకీయాల గురించి ఎన్నో వార్తలను విన్నాము. మిజోరాం రాష్ట్రంలో జోరామ్ పీపుల్స్ మూమెంట్( ZPM) ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని.. ఆ ఎన్నికలలో గెలుపొందిన వారిలో ‘బారిల్ వన్నెహ్‌సాంగి’ అనే మహిళా అందరిలో ప్రత్యేకంగా నిలిచిందని..ఇలా అనేక వార్తలను విన్నాము. బారిల్ మొదట యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి క్రమంగా రాజకీయాల్లో అత్యంత పిన్న వయస్కురాలిగా.. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ మహిళా మరో అద్భుతమైన ఘనతను సాధించింది. మిజోరాం అసెంబ్లీకి మార్చి 7న ఓ అద్భుతమైన రోజుగా నిలిచిపోయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి .. తొలిసారి ఓ మహిళా స్పీకర్ గా నియమితులయ్యారు. ఆ మహిళా మరెవరో కాదు బారిల్ వన్నెహసాంగి. మిజోరాం రాజకీయాల్లోనే ఈసారి .. సరికొత్త అద్భుతాలు జరిగిన క్రమంలో.. ఇప్పుడు ఈ వార్త మరోసారి .. మిజోరం రాజకీయ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. మునుపెన్నడూ లేని విధంగా.. ఇప్పుడు మిజోరాం రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే అయినా.. బారిల్ వన్నెహసాంగి మార్చి 7న జరిగిన అసెంబ్లీ సెషన్‌లో స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు. మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అగ్రనేత లాల్దుహోమా పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని సాంప్రదాయ కట్టుబాట్లను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు.. ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందని వారు తెలియజేశారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. వారిలో గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎంపికయ్యారు. వారిలో రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన.. 32 ఏళ్ల బారిల్ వన్నెహసాంగి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు.. వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పనిచేశారు. తొలుత ఆమె టెలివిజన్ యాంకర్‌గా పనిచేశారు. ఇక సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరి మిజోరాం రాష్ట్రంలోనే తోలి మహిళా స్పీకర్ గా ఎంపికైన.. బారిల్ వన్నెహసాంగి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి