iDreamPost
android-app
ios-app

బాంబు పేల్చిన బండ్ల గణేష్ – సినిమాను మించిన ట్విస్టు

  • Published Sep 06, 2021 | 3:34 AM Updated Updated Sep 06, 2021 | 3:34 AM
  • Published Sep 06, 2021 | 3:34 AMUpdated Sep 06, 2021 | 3:34 AM
బాంబు పేల్చిన బండ్ల గణేష్ – సినిమాను మించిన ట్విస్టు

టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఎలక్షన్లు జరిగే లోపే క్రైమ్ థ్రిల్లర్ ని మించిన ట్విస్టులు ఎన్నో రాబోతున్నట్టు అర్థమవుతోంది. నిన్న బండ్ల గణేష్ ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకోవడం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. జీవిత రాజశేఖర్ ని తమ జట్టులోకి తీసుకున్నందుకు నిరసనగా తాను బయటికి వచ్చేశానని ఏకంగా ఒక ఒక న్యూస్ ఛానల్ కి వెళ్లి మరీ ఇంటర్వ్యూ ఇవ్వడం కలకలం రేపుతోంది. తాను దేవుళ్ళుగా భావించిన మెగాస్టార్ కుటుంబం మీద విమర్శలు చేసిన వాళ్ళతో కలిసి ఉండలేనని అందుకే ఈ నిర్ణయం తప్పలేదని గణేష్ ప్రస్తావించడం విశేషం.

అక్కడితో అయిపోలేదు. గతంలో జీవిత, రాజశేఖర్ లు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల మీద చేసిన కామెంట్ల తాలూకు పాత వీడియోలను బండ్ల గణేష్ అదే పనిగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఇంకో మలుపు. అప్పుడు ఎలా మాట్లాడారో చూడండని తన చర్యకు సమర్ధింపును తెచ్చుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. దీనికి జీవిత రాజశేఖర్ స్పందిస్తూ ముగిసిపోయిన అధ్యాయాలను ఇప్పుడు ఎందుకు తవ్వి తీస్తున్నారో అర్థం కావడం లేదని, ప్రకాష్ రాజ్ తనతో పలుమార్లు చర్చించి అన్నీ వివరించాకే తాను అందులో చేరానని వివరణ ఇచ్చారు. ఇప్పుడీ వ్యవహారం ఒకరకంగా చిరంజీవిని కాస్త పరోక్షంగా కాస్త ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టినట్టే.

Watch Here: Bandla Ganesh Interview

జీవిత మీద జెనరల్ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తానని చెప్పడం ద్వారా గణేష్ దీనికి మరింత వేడి రాజేశారు. మరోవైపు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సినిమా బిడ్డలుతో కలిసి ఆఫీస్ లో మీటింగులు జరుపుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికను అందులో చర్చించారు. ఈ సమావేశానికి రమ్మని ఆహ్వానం ఇచ్చిన టైంలోనే బండ్ల గణేష్ తప్పుకునే ప్రకటన చేసినట్టు సమాచారం. దీనికి జీవిత స్పందించారు కానీ ఇంకా ప్రకాష్ రాజ్ రెస్పాండ్ కాలేదు. గణేష్ తో మాట్లాడి ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వినికిడి. ఇప్పుడే వాతావరణం ఇంత వేడిగా ఉందంటే రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూడాలి మరి

Also Read: సినిమా ఎలక్షన్ల వెనుక రాజకీయ ఎత్తులు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcratosroyal girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio