iDreamPost
android-app
ios-app

తూచ్.. మాట మార్చిన బండ్లన్న

  • Published Dec 12, 2022 | 10:32 PM Updated Updated Dec 05, 2023 | 5:11 PM

సినిమా వేడుకల్లో ఆయన స్పీచ్ లకు ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈమధ్య వేదికలపై స్పీచ్ లు ఇచ్చే అవకాశం పెద్దగా రాకపోవడంతో..

సినిమా వేడుకల్లో ఆయన స్పీచ్ లకు ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈమధ్య వేదికలపై స్పీచ్ లు ఇచ్చే అవకాశం పెద్దగా రాకపోవడంతో..

  • Published Dec 12, 2022 | 10:32 PMUpdated Dec 05, 2023 | 5:11 PM
తూచ్.. మాట మార్చిన బండ్లన్న

నటుడిగా, నిర్మాతగా కంటే కూడా తన మాటలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు బండ్ల గణేష్. సినిమా వేడుకల్లో ఆయన స్పీచ్ లకు ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈమధ్య వేదికలపై స్పీచ్ లు ఇచ్చే అవకాశం పెద్దగా రాకపోవడంతో.. ట్విట్టర్ వేదికగా ఆ సరదా తీర్చుకుంటున్నాడు. వరుస ట్వీట్ లతో ఫుల్ బిజీగా ఉండే ఆయన తాజాగా హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు. మళ్లీ కాసేపటికే “తూచ్ నేను ఆయనేం అనలేదు” అంటూ మాట మార్చేశాడు.

“మనకి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు.. వారిని ప్రేమించటం పూజించటం మన ధర్మం” అంటూ ట్వీట్ చేసిన బండ్ల గణేష్ రెండు ఫోటోలను కూడా షేర్ చేశాడు. అందులో ఒక ఫోటోలో బండ్ల ఆయన తండ్రికి సేవ చేస్తున్నట్లుగా ఉండగా.. మరో ఫోటోలో విజయ్ తన తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వకుండా కూర్చున్నట్లుగా ఉంది. ఆ ట్వీట్, ఫోటోలు చూసిన అందరికీ బండ్ల కావాలనే విజయ్ ని టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే తనని చూసి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో విజయ్ నేర్చుకోవాలి అన్నట్లుగా గణేష్ ట్వీట్ ఉంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ బండ్లపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. అయితే బండ్ల మాత్రం “ప్రతి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి.. నేను ప్రేమతోనే చెప్పాను” అంటున్నాడు. అంతటితో ఆగకుండా మళ్లీ కాసేపటికే.. తండ్రి హరికృష్ణ పాదాల దగ్గర కూర్చొని ముచ్చటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని రీట్వీట్ చేశాడు. దీంతో బండ్ల కావాలనే విజయ్ ని టార్గెట్ చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గతంలో కూడా లైగర్ మూవీ సమయంలో కూడా విజయ్ ని టార్గెట్ చేస్తూ బండ్ల ఇలాగే ట్వీట్ చేశాడు. ఆ మూవీ ట్రైలర్ ఈవెంట్ లో “మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు.. అయినా ఈ రచ్చ ఏందిరా నాయనా” అంటూ విజయ్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి. అయితే అప్పుడు ఆ కామెంట్స్ కి కౌంటర్ ఇస్తున్నట్లుగా బండ్ల ఓ ట్వీట్ చేశాడు. “తాతలు తండ్రులు ఉంటే సరిపోదు.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ లా టాలెంట్ కూడా ఉండాలి గుర్తుపెట్టుకో బ్రదర్” అంటూ బండ్ల అప్పుడు సంచలన ట్వీట్ చేశాడు. ఇప్పుడు మరోసారి విజయ్ ని టార్గెట్ చేసి వార్తల్లో నిలిచాడు. మరి బండ్ల ఇంతలా విజయ్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom