ఆన్ స్టాపబుల్ కోసం చరణ్ కేటీఆర్

బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఇంకో నెలలో ముగియనుంది. పొలిటికల్ ఫ్లేవర్ ఎక్కువవ్వడంతో మొదట్లో దీనికి మిశ్రమ స్పందన దక్కినా ప్రభాస్ వచ్చాక ఒక్కసారిగా క్యాలికులేషన్స్ అన్నీ మారిపోయాయి. అసలు స్ట్రీమింగ్ మొదలుకాకుండానే క్రాష్ ఆయిన మొదటి తెలుగు యాప్ గా ఆహాకి డార్లింగ్ దెబ్బ గట్టిగానే తగిలింది. మరి రెండో ఎపిసోడ్ కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి. ఒక ఓటిటి టాక్ షో పైరసీ కాకుండా కోర్టు దాకా వెళ్లడం కూడా ఈ అన్ స్టాపబుల్ విషయంలోనే జరిగింది. ఉత్తర్వులు అయితే తెచ్చుకున్నారు కానీ మహా నిర్మాతలకే సాధ్యం కానీ ఈ కట్టడిని ఆహా ఎలా చేస్తుందో చూడాలి

ఇక విషయానికి వస్తే త్వరలో ప్రత్యేక గెస్టులు రామ్ చరణ్ కేటీఆర్ రాబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. మొన్న జరిగిన ఎపిసోడ్ లో బాలయ్య చరణ్ ల మధ్య సంభాషణలో ఇద్దరూ పరస్పరం హింట్లు ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఒక కాల్ దూరంలో ఉన్నానని ఎప్పుడు పిలిచినా వస్తానని చిరు తనయుడు చెప్పడం దానికి బాలకృష్ణ త్వరలోనే ప్లాన్ చేద్దామని సంకేతం ఇవ్వడం ఇవన్నీ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. మెగా ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తే ప్రోగ్రాంకి డబుల్ మైలేజ్ వస్తుంది. రెండు విభిన్న రంగాలకు చెందిన ఇద్దరు టాప్ సెలబ్రిటీలను ఎలా హ్యాండిల్ చేస్తారనే ఆసక్తి సగటు మాములు జనంలోనూ ఉంటుంది.

ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ టాక్స్ అయితే జోరుగా ఉన్నాయి. వీళ్ళే కాదు కమల్ హాసన్ ని వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ లో శృతి హాసన్ తో పిలవాలనే ప్రపోజల్ మీద ప్రస్తుతం టీమ్ వర్క్ చేస్తోంది. ఒకవేళ లోకనాయకుడు కనక ఓకే అంటే శనివారమే షూటింగ్ జరుగుతుంది. 12న సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఆ మరుసటి రోజు 13న రిలీజ్ చేసే లక్ష్యంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ది చివరిలో ఉంటుంది. అంతకన్నా ముందే ఛాన్స్ లేదు. మొత్తానికి స్పెషల్ గెస్టులతో అన్ స్టాపబుల్ షోకి కొత్త కలరింగ్ వస్తోంది. వాల్తేరు వీరయ్య బృందాన్ని కూడా పిలిచే ఆలోచన ఉన్నా షెడ్యూల్స్ టైట్ గా ఉన్న కారణంగా అది జరిగే అవకాశాలు లేనట్టే

Show comments