iDreamPost
android-app
ios-app

అన్ స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గోల!

  • Published Dec 28, 2022 | 10:32 AM Updated Updated Dec 09, 2023 | 12:21 PM

బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. సినిమాల్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. రాజకీయాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. రీల్ లైఫ్ లో ఆయన నడిచి వస్తుంటే ఈలలు కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి.

బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. సినిమాల్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. రాజకీయాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. రీల్ లైఫ్ లో ఆయన నడిచి వస్తుంటే ఈలలు కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి.

అన్ స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గోల!

హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. దర్శకుడు ఎవరా అనేది సంబంధం లేకుండా కేవలం ఆయన తెర మీద కనిపిస్తే చాలు.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. సినిమాల్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. రాజకీయాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. రీల్ లైఫ్ లో ఆయన నడిచి వస్తుంటే ఈలలు కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన.. సమాజానికి మంచి చేస్తా, మెసేజ్ లు ఇస్తా అని బయల్దేరాడు అంటూ ఆయనను టార్గెట్ చేస్తూ ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ సాక్షిగా పవన్ ఓపెన్ అయ్యాడట.

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓటీటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో పవన్ సందడి చేయనున్నాడు. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఈ షోలో బాలకృష్ణ మాట్లాడుతూ.. పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చినట్టు సమాచారం. ఏంటి ఈ పెళ్లిళ్ల గోల అని బాలకృష్ణ అడగగా.. పవన్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడట. పవన్ ఇచ్చిన ఆన్సర్ కి బాలకృష్ణ ఫిదా అయినట్లు తెలుస్తోంది.

ఇటీవల ‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొన్న తన అల్లుడు నారా లోకేష్ ని సైతం బాలకృష్ణ ఇటువంటి ప్రశ్నే అడిగాడు. విదేశీ అమ్మాయిలతో కలిసి లోకేష్ మందు తాగుతున్న ఫోటోలు, స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతున్న ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇదేనా నారా సంస్కారం అంటూ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. షోలో ఆ ఫోటోలను చూపిస్తూ సొంత అల్లుడిని బాలకృష్ణ అసలు ఈ ఫోటోల విషయమేంటి అని అడగగా.. అందులో తప్పేముంది అంటూ లోకేష్ సమర్థించుకున్నాడు. ఫోటోల్లో ఉంది తానేనని, వాళ్ళు బ్రహ్మణికి కూడా ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు.

లోకేష్ ఫోటోలపై ఎలా అయితే ట్రోల్స్ వచ్చాయో.. పవన్ మూడు పెళ్లిళ్లపై కూడా అలాగే ట్రోల్స్ వచ్చాయి. సొంత అల్లుడినే ప్రైవేట్ ఫోటోల గురించి మొహమాటం లేకుండా అడిగిన బాలకృష్ణ.. పవన్ ని సైతం అలాగే పెళ్లిళ్ల గురించి అడిగాడని అంటున్నారు. దీంతో పవన్ చెప్పిన సమాధానం ఏంటా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş