iDreamPost
android-app
ios-app

తండ్రి బీజేపీ ఎంపీ,కొడుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే .. రాజకీయ విచిత్రం

తండ్రి బీజేపీ ఎంపీ,కొడుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే .. రాజకీయ విచిత్రం

అందరిదీ ఓ దారి అయితే ఆ ఎమ్మెల్యే కి మరో దారి. అందరి చూపు కాషాయం వైపు ఉంటే, ఆయన మాత్రం మూడు రంగుల జెండానే ముద్దు అంటున్నారు,అధికార పార్టీని కాదని ప్రతిపక్షంలో చేరాడు. కర్ణాటక విధాన సభ కు హోస్ కోటే నుంచి ప్రతినిత్యం వహిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే శరత్ బచ్చే గౌడ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శరత్ తండ్రి బీఎన్ బచ్చే గౌడ బిజెపిలో కీలక నాయకుడిగా, చిక్ బళ్లాపూర్ సిట్టింగ్ ఎంపీ . 1972 నుంచి 2004 వరకు హోస్ కోటేఅయితే బచ్చే గౌడ లేదంటే ఆయన కజిన్ చిక్క గౌడ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొదట జనతాదళ్,జనతాదళ్(యస్)లో ఉన్న బచ్చే గౌడ 2008లో బీజేపీలో చేరారు. హోస్ కోటే నియోజకవర్గంలో బచ్చే గౌడ వక్కిళిగ సామజిక వర్గం బలమైంది.

బీజేపీ రెబల్ గా బరిలోకి

బచ్చే గౌడ కుటుంబం 2008 నుంచి బీజేపీ పక్షాన ఉంది. 2018లో కర్ణాటక రాష్ట్ర విధాన సభకు జరిగిన ఎన్నికల్లో శరత్ బచ్చే గౌడ బెంగళూరు రూరల్ పరిధిలోని హోస్ కోటే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంటిబీ నాగరాజ్ చేతిలో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయారు.

అయితే కర్ణాటక రాజకీయ సంక్షోభంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నాగరాజ్ నూ అనర్హుడిగా అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. దీంతో హోస్ కోటే విధాన సభకు 2019 డిసెంబర్ లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2019 ఏప్రిల్-మే నెలలో జరిగిన లోక్ సభా ఎన్నికల్లో బచ్చే గౌడ బీజేపీ తరుపున చిక్ బళ్లాపూర్ ఎంపీగా గెలిచిఉండటం,ఇరు పక్షాలను చేరదీయాలన్న లక్ష్యంతో బీజేపీ హోస్ కోటే ఉప ఎన్నికల్లో బచ్చెగౌడ కొడుకు శరత్ ను కాదని యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావటానికి సహకరించి బీజేపీలోకి ఫిరాయించి ,డిస్ క్వాలిఫై అయినా ఎంబీటీ నాగరాజుకు టికెట్ కేటాయించింది.

2018లో తన ప్రత్యర్థి అయిన వ్యక్తి ,సంవత్సరం తిరగకముందే తన పార్టీ అభ్యర్థి అవడం, పార్టీ ఆదేశాల మేరకు అతని తరుపున ప్రచారం చేయాల్సి రావడం,1972 నుంచి తమకుటుంబం పోటీ చేస్తున్న హోస్ కోటే నియోజకవర్గంలో తమను కాదని నాగరాజ్ కు బీజేపీ టికెట్ ఇవ్వటం బచ్చే గౌడ కుమారుడు శరత్ లో అసహనాన్ని నింపింది.

బీజేపీ రెబెల్ గా బరిలోకి

హోస్ కోటే నియోజకవర్గం మొత్తం శరత్ కు ముందు నుంచి పరిచయం. 2008 ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ గెలిచింది. ప్రతిసారీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించే శరత్ 2019 ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనకు జరిగిన అన్యాయం మీద, పార్టీ అనుసరించిన వైఖరి మీద విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, తన ఐటీ మిత్రుల సహాయంతో సాంకేతికంగానూ, సోషల్ మీడియా పరంగానూ పెద్ద క్యాంపెయిన్ నడిపించారు. దీంతో ఉప ఎన్నికల్లో శరత్ బచ్చే గౌడ బిజెపి అభ్యర్థి నాగరాజ్ పై 11,486 ఓట్లతో విజయం సాధించి తన పంతం నెగ్గించుకున్నారు. దాని తర్వాత శరత్ చేతిలో ఓడిపోయిన నాగరాజ్ కి బీజేపీ శాసనమండలికి పంపి ఆయనను మంత్రిని చేసింది. ఇది శరత్ లో మరింత కోపాన్ని మిగిల్చింది.

కీలక బాధ్యతలు అప్పగించే దశగా!

శరత్ ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిక మీద భిన్న వాదనలు ఉన్నా, బీజేపీ మీద ఉన్న తీవ్రమైన కోపమే ఆయనను కాంగ్రెస్ వైపు నడిపించింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ జోరు మీద ఉన్న సమయంలో శరత్ కాంగ్రెస్లో కి రావడానికి ప్రత్యేకమైన కారణం ఉండి ఉండొచ్చని అనిపిస్తోంది. వక్కిళిగా సామాజిక వర్గం యువతను సమీకరించే బలం శరత్ కు ఉంది. కర్ణాటక రాజకీయాల్లో కీలకం అయ్యే ఈ సామాజిక వర్గం నుంచి ఏ రకమైన నేత కాంగ్రెస్ నుంచి రాజకీయంగా పూర్తి బాధ్యతలు శేఖర్ ఇస్తే బాగుంటుందనే కోణంలోనే శరత్ ను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చారని వాదన ఉంది. త్వరలో ఆయనకి రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ పదవి ఈ అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అంచనా..