iDreamPost
android-app
ios-app

ఢిల్లీ ప్రీమియర్‌ టీ20 లీగ్‌: ఆయూష్‌ బదోని విధ్వంసం.. వరుసగా 6 సిక్సులు హైలెట్!

  • Published Aug 31, 2024 | 4:56 PM Updated Updated Aug 31, 2024 | 4:56 PM

Ayush Badoni, Delhi Premier League 2024, SDS vs NDS, Priyansh Arya: టీ20లో కనీవినీ ఎరుగని విధంగా భారత యువ క్రికెటర్లు ఒకే ఇన్నింగ్స్‌ ఇద్దరు సెంచరీలు చేసి.. ఏకంగా 308 పరుగులు సాధించాడు. ఇందులో బదోని పాత్ర చాలా ఉంది. ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Ayush Badoni, Delhi Premier League 2024, SDS vs NDS, Priyansh Arya: టీ20లో కనీవినీ ఎరుగని విధంగా భారత యువ క్రికెటర్లు ఒకే ఇన్నింగ్స్‌ ఇద్దరు సెంచరీలు చేసి.. ఏకంగా 308 పరుగులు సాధించాడు. ఇందులో బదోని పాత్ర చాలా ఉంది. ఆ విధ్వంసకర ఇన్నింగ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 31, 2024 | 4:56 PMUpdated Aug 31, 2024 | 4:56 PM
ఢిల్లీ ప్రీమియర్‌ టీ20 లీగ్‌: ఆయూష్‌ బదోని విధ్వంసం.. వరుసగా 6 సిక్సులు హైలెట్!

ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో విధ్వంసం జరిగింది. భారత యువ క్రికెటర్లు ఆయూష్‌ బదోని, ప్రియాన్ష్‌ ఆర్య సంచలన బ్యాటింగ్‌తో క్రికెట్‌ ప్రపంచం ఉలిక్కిపడేలా చేశారు. ముఖ్యంగా బదోని అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సుర్ల సునామీ సృష్టిస్తూ.. భారత క్రికెట్‌ చరిత్రలో టీ20 మ్యాచ్‌లో కనీవినీ ఎరుగని విధంగా.. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 308 పరుగులు చేసేలా తమ బ్యాటింగ్‌ సాగించారు. శనివారం సౌత్‌ ఢిల్లీ సూపర్ స్టార్జ్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌.. ఈ యువ క్రికెటర్ల ఊచకోతకు వేదికైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌ ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో ఏకంగా 308 పరుగులు చేసింది. ఈ అరాచకానికి ఆ జట్టు కెప్టెన్‌ ఆయూష్‌ బదోని, ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య కారణం అయ్యారు. ఓపెనర్‌ సర్తక్‌ రాయ్‌ 11 పరుగులు మాత్రమే చేసి అవుటైనా.. మరో ఓపెనర్‌ ఆర్య 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సులతో 120 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఆర్య వరుసగా ఆరు సిక్సులు బాదడం విశేషం. అతనితో పాటు కెప్టెన్‌ బదోని.. 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్సులతో ఏకంగా 165 పరుగులు బాదేశాడు. ఐపీఎల్‌లో కూడా ఇంతటి విధ్వంసం జరగలేది. ఈ ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు సంచలన బ్యాటింగ్‌తో రికార్డు స్కోర్లు చేసినా.. ఆ 300 మార్క్‌ను అందుకోలేకపోయారు. ఆయూష్‌ బదోని.. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

మొత్తంగా సౌతా ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. ఆర్య, బదోని సెంచరీలతో చెలరేగారు. వీరి దెబ్బకు నార్త్‌ ఢిల్లీ బౌలర్లు పరుగుల ప్రవాహంలో కొట్టుకొనిపోయారు. ఆరుగురు బౌలర్లలో ఐదు మంది ఎకానమీ 12కి పైగానే ఉందంటే.. వాళ్ల విధ్వంస ఏం రేంజ్‌లో సాగిందో ఊహించుకోవచ్చు. మనన్‌ భరధ్వాజ్‌ అనే బౌలర్‌ అయితే.. 2 ఓవర్లలోనే ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 309 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్‌ ఢిల్లీ 5 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసింది. మరి ఈ మ్యాచ్‌లో బదోని, ఆర్య బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.