iDreamPost
android-app
ios-app

ఆయుష్ పీజీ లో ఎస్టీ రిజర్వేషన్ అమలు

ఆయుష్ పీజీ లో ఎస్టీ రిజర్వేషన్ అమలు

 ఏపీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన విద్యార్థులకు ఆయూష్‌లో పీజీ సీట్లలో చోటు కల్పించింది. గత ఐదేళ్లలో ఆయూష్‌ పీజీ సీట్లలో గిరిజన (ఎస్టీ) రిజర్వేషన్లు అమలు కాలేదు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఒక సీటు, తిరుపతి కళాశాలలో రెండు సీట్లను గిరిజనులకు కేటాయించింది.