iDreamPost
android-app
ios-app

అయోధ్య రామోత్సవం స్పెషల్.. ‘హనుమాన్‌’ టికెట్స్‌ ఒకటి కొంటే ఇంకొకటి​ ఫ్రీ!

  • Published Jan 22, 2024 | 2:24 PMUpdated Jan 22, 2024 | 3:45 PM

Ayodhya Hanuman Movie:ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామనామం వినిపిస్తోంది. కోట్లాది మంది భక్తులు ఆ రాముని దర్శన భాగ్యం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇంతటి ఆద్భుతమైన ఘట్టం జరుగుతున్న వేళలో ఇటీవలే సంక్రాతి కానుకగా హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీపై ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకి అదేమిటంటే..

Ayodhya Hanuman Movie:ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామనామం వినిపిస్తోంది. కోట్లాది మంది భక్తులు ఆ రాముని దర్శన భాగ్యం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇంతటి ఆద్భుతమైన ఘట్టం జరుగుతున్న వేళలో ఇటీవలే సంక్రాతి కానుకగా హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీపై ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jan 22, 2024 | 2:24 PMUpdated Jan 22, 2024 | 3:45 PM
అయోధ్య రామోత్సవం స్పెషల్.. ‘హనుమాన్‌’ టికెట్స్‌ ఒకటి కొంటే ఇంకొకటి​ ఫ్రీ!

ప్రస్తుతం జగమంతా రామనామం వినిపిస్తోంది. మరికొద్ది సేపట్లో ఆ కొందాడ రాముడు తన జన్మస్థానంలో కొలువు దీరనున్నడు. ఆ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠను వీక్షించేందుకు యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 500 ఏళ్ల హిందువూలా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఈ రోజు రామ మందిర ప్రారంభ ఉత్సవానికి నాంది పలుకుతుంది. అయోధ్యా నగరంలో ఈ ఆద్భుతమైన ఘట్టన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కోట్లాది మంది భక్తులు ఆ రాముని దర్శన భాగ్యం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవ వేడుకలకు నేరుగా వెళ్లలేని రామ భక్తులు కోసం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి జన్మదన్యం చేసుకోనే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే సంక్రాతి కానుకగా యాంగ్ హీరో తేజ సజ్జ నటించిన ‘హనుమాన్’ మూవీకి భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి సమయంలో హనుమాన్ మూవీపై ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఇంతకి అదేమిటంటే..

ఇటీవలే తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హనుమాన్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించి రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీ లవర్స్‌కు మిరాజ్ సినిమాస్ యాజమాన్యం తాజాగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించించింది. అదేమిటంటే హనుమాన్​ సినిమాకు సంబంధించి ‘బై వన్‌ గెట్‌ వన్’ (ఒక టికెట్‌ కొంటే ఇంకొకటి ఉచితం) టికెట్స్ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. అంతేకాకుండా.. దీనిని బుక్​ మైషోలో ‘MIRAJBOGO’ అనే కోడ్‌ను ఉపయోగించి ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ అయోధ్య రామోత్సవం వేడుకల సందర్భంగా ఒక్కరోజు మాత్రమేనని వెల్లడించింది. కాగా, ఇప్పటికే హనుమాన్‌ సినిమాను చూడకపోయిన వాళ్లకి ఇది ఒక మంచి ఆవకాశమని,వెంటనే మిరాజ్‌ సినిమాస్ ఆఫర్‌ను వినియోగించుకోండి అంటూ తెలిపింది.

కాగా, ప్రశాంత్‌ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రంలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్‌ కీలక పాత్రలో మెరిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టింది. ఇక త్వరలోనే ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరబోతుందని అంచనాలు నెలకున్నాయి. అలాగే హనుమాన్‌ వచ్చే ప్రతి టికెట్‌పై 5 రూపాలయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే..ఆదివారం హనుమాన్‌ మూవీ టికెట్లపై వచ్చిన ఆదాయంలో 2.66 కోట్ల రూపాయలను బాలరాముడికి విరాళంగా అందజేసింది. మరి, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా హనుమాన్ మూవీ పై ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి