iDreamPost
android-app
ios-app

వీడియో: సూపర్‌ క్యాచ్‌లు పట్టిన టీమిండియా స్పిన్నర్లు! రెండింటిలో ఏది బెస్ట్‌ అంటే..?

  • Published Apr 08, 2024 | 10:42 AM Updated Updated Apr 08, 2024 | 10:42 AM

Axar Patel, Ravi Bishnoi: అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌.. ఈ ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో సూపర్‌ క్యాచ్‌లు పట్టారు. అయితే.. రెండు సూపర్‌ క్యాచ్‌లే అయినప్పటికీ.. వాటిలో ఏది బెస్ట్‌ క్యాచ్‌ అనే చర్చ జరుగుతోంది. మరి ఆ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం..

Axar Patel, Ravi Bishnoi: అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌.. ఈ ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో సూపర్‌ క్యాచ్‌లు పట్టారు. అయితే.. రెండు సూపర్‌ క్యాచ్‌లే అయినప్పటికీ.. వాటిలో ఏది బెస్ట్‌ క్యాచ్‌ అనే చర్చ జరుగుతోంది. మరి ఆ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 08, 2024 | 10:42 AMUpdated Apr 08, 2024 | 10:42 AM
వీడియో: సూపర్‌ క్యాచ్‌లు పట్టిన టీమిండియా స్పిన్నర్లు! రెండింటిలో ఏది బెస్ట్‌ అంటే..?

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడింది. రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆడింది. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు సూపర్ క్యాచ్‌లు చోటు చేసుకున్నాయి. రెండు కూడా దాదాపు ఒక విధమైన క్యాచ్‌లే. ఇద్దరు స్పిన్నర్లు కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. పైగా ఇద్దరూ భారతీయ స్పిన్నర్లే కావడం విశేషం. ఒకరు అక్షర్‌ పటేల్‌, మరొకరు రవి బిష్ణోయ్‌. ముంబైతో ఆడుతూ ఢిల్లీ ప్లేయర్‌ అక్షర్‌.. ఇషాన్‌ కిషన్‌ను, గుజరాత్‌తో ఆడుతూ.. లక్నో ప్లేయర్‌ రవి బిష్ణోయ్‌.. కేన్‌ విలియమ్సన్‌ను అవుట్‌ చేశారు. ఈ రెండూ సూపర్‌ క్యాచ్‌లే అయితే.. ఆ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. అయితే.. ఈ రెండు క్యాచెస్‌లో ఏది బెస్ట్‌ క్యాచ్‌ అని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఆ రెండు క్యాచ్‌ల్లో ఏది బెస్ట్‌ క్యాచ్‌ అవుతుందో కాస్త విశ్లేసించి చూద్దాం..

ముందుగా అక్షర్‌ పటేల్‌ పట్టిన క్యాచ్‌ గురించి మాట్లాడుకుంటే.. ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అక్షర్‌ పటేల్‌.. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. అక్షర్‌ తొలి బంతిని ఫ్లైటెడ్‌ డెలవరీగా వేశాడు.. దాన్ని ఇషాన్‌ కిషన్‌ మిడ్‌ వికెట్‌ పైనుంచి భారీ సిక్స్‌ కొట్టాడు. తొలి బంతికే సిక్స్‌ కొట్టిన అక్షర్‌లో కసి పెరిగింది. రెండు బంతికి కూడా ఇషాన్‌ గట్టి షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. బౌలర్‌ ఎడమవైపు నుంచి వెళ్లేలా చాలా హార్డ్‌గా కొట్టాడు. బాల్‌ రాకెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తుంటే.. అక్షర్‌ పటేల్‌ అంతే స్పీడ్‌లో ఒక్కో చేత్తోనే ఆ బాల్‌ను పట్టేశాడు. అయస్కాంతానికి ఇనుము అతుక్కున్నట్లు.. అక్షర్‌ చేతికి బాల్‌ చిక్కింది. ఆ క్యాచ్‌ను చూసి.. ఇషాన్‌ కిషన్‌ సైతం నమ్మలేకపోయాడు. కానీ, 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు.

ఇక రవి బిష్ణోయ్‌ పట్టిన క్యాచ్‌ గురించి మాట్లాడుకుంటే.. గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న టైమ్‌లో రవి బిష్ణోయ్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేశాడు. ఆ ఓవర్‌ రెండో బంతికే కేన్‌ విలియమ్సన్‌ బౌలర్‌ పైనుంచి షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, రవి బిష్ణోయ్‌ అమంతాం గాల్లోకి ఎగిరి సింగిల్‌ హ్యాండ్‌తోనే ఆ క్యాచ్‌ను పట్టి ఔరా అనిపించాడు. ఆ స్టన్నింగ్‌ క్యాచ్‌తో లక్నో టీమ్‌ మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఊహించని క్యాచ్‌తో వెంట వెంటనే రెండో వికెట్‌ తీసిన బిష్ణోయ్‌ని లక్నో ప్లేయర్లు అభినందనలతో మంచెత్తారు. బిష్ణోయ్‌ దెబ్బకు కేన్‌ మామ ఒక్క రన్‌కే అవుట్‌ అయ్యాడు. అయితే.. అక్షర్‌ పటేల్‌, బిష్ణోయ్‌ ఇద్దరు పట్టిన క్యాచ్‌లు అద్భుతంగా ఉన్నా.. కాస్త బిష్ణోయ్‌ క్యాచ్‌కు వెయిటేజ్‌ ఇవ్వొచ్చు. ఎందుకంటే.. సడన్‌గా దూసుకొస్తున్న బంతికి అక్షర్‌ చేయి అడ్డుపెట్టాడు. కానీ, బిష్ణోయ్‌ బాల్‌ను గమనించి.. గాల్లోకి జంప్‌ చేసి మరీ క్యాచ్‌ అందుకున్నాడు. సో.. ఈ రెండు క్యాచ్‌ల్లో బిష్ణోయ్‌ క్యాచ్‌కు కాస్త ఎక్కువ మార్కుల ఇవ్వొచ్చని క్రికెట్‌ పండితులు అంటున్నారు. మరి ఈ రెండు క్యాచెస్‌లో మీకు ఏది బెస్ట్‌ అనిపించిందో కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.