iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 3 రాహుల్ పై పబ్బులో దాడి

  • Published Mar 05, 2020 | 6:00 AM Updated Updated Mar 05, 2020 | 6:00 AM
బిగ్ బాస్ 3 రాహుల్ పై పబ్బులో దాడి

గత ఏడాది జరిగిన బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ లో విన్నర్ గా నిలిచిన గాయకుడు రాహుల్ సింప్లిగంజ్ మీద నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ పబ్బులో దాడి జరగడం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ తో ఉన్న ఒక స్నేహితురాలి మీద కొందరు కామెంట్స్ చేశాక ఈ గొడవ మొదలయిందని వ్యవహారం ముదిరిపోయి బీర్ బాటిల్స్ తో రాహుల్ మీద దాడి చేసేదాకా పరిస్థితి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇదంతా కొందరు సెల్ ఫోన్ లో షూట్ చేయడంతో ఇప్పుడా వీడియోలు వైరల్ అయ్యాయి.

అందులో చాలా స్పష్టంగా ఒకరిద్దరు రాహుల్ తలపై బాటిల్స్ తో కొట్టడం ఇదంతా పలు న్యూస్ ఛానల్స్ లో కూడా ప్రసారం కావడం సంచలనం రేపుతోంది. దీని వెనుక స్పష్టమైన కారణాలు తెలియలేదు. దీన్ని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాహుల్ దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టుగా తెలిసింది. గాయాలు స్వల్పంగానే కావడంతో తీవ్రత అంతగా లేదు. డిస్ఛార్జ్ అయ్యింది లేనిది ఇంకా తెలియలేదు

బిగ్ బాస్ టైటిల్ గెలిచాక రాహుల్ పేరు మారుమ్రోగిపోయింది. అందులోనూ ఇటీవలే కొన్ని సినిమాలకు అతను పాడిన పాటలు బాగా హిట్టవడంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి దాడి జరగడం షాక్ కలిగించే అంశమే. అయితే జరిగిన ఘర్షణలో ఒక ఎమ్మెల్యే తమ్ముడు కూడా ఉన్నాడని రాహుల్ ని కొట్టినవాళ్ళలో అతని ప్రమేయం కూడా ఉందని వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇటీవలే కాలంలో హైదరాబాద్ లో మిడ్ నైట్ పబ్ కల్చర్ చాలా మాములు విషయం అయిపోయింది. ఆడమగ తేడా లేకుండా కాలాన్ని మర్చిపోయి అక్కడ ఎంజాయ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యువతియవకులు నగరంలో లక్షల్లో ఉన్నారు. ఇప్పుడీ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు

Jojobet Girişjojobetjojobetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişCasibomCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş