iDreamPost
android-app
ios-app

వరుస విషాదాలు.. క్యాన్సర్‌తో ఐపీఎస్‌ భార్య మృతి.. నిమిషాల వ్యవధిలోనే

  • Published Jun 19, 2024 | 11:26 AM Updated Updated Jun 19, 2024 | 11:26 AM

వరుస వివిదాలు కుటుంబంలో చోటు చేసుకోవడమే కాకుండా.. నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్న  భార్య క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోవడంతో ఓ భర్త ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇక భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు.

వరుస వివిదాలు కుటుంబంలో చోటు చేసుకోవడమే కాకుండా.. నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్న  భార్య క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోవడంతో ఓ భర్త ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇక భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక ఓ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు.

  • Published Jun 19, 2024 | 11:26 AMUpdated Jun 19, 2024 | 11:26 AM
వరుస విషాదాలు.. క్యాన్సర్‌తో ఐపీఎస్‌ భార్య మృతి.. నిమిషాల వ్యవధిలోనే

దాంపత్య జీవితం అంటే వేద మంత్రల సాక్షిగా.. మూడు ముళ్లు ఏడు అడుగులు మాత్రమే అని చాలామంది అనుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది అలానే వ్యవహారిస్తున్నారు. ఈ క్రమంలోనే.. వైవాహిక జీవితాన్ని ముళ్లదారి పట్టిస్తున్నారు. కానీ, ఈ వైవాహిక జీవితం అనేది.. మూడు ముళ్లు, ఏడు అడుగులు మాత్రమే కాదు.. జీవితంతాం ఏ చిన్న కష్టం వచ్చిన ఆ చేయి విడువనని, కడవరకు తోడు ఉంటాననే ప్రమాణం చేసుకుంటూ ఆ బంధంలోకి అడుగు పెడతారు. అయితే నేటి కాలంలో పెళ్లినాటి ప్రమాణాలు మార్చిపోతూ చాలామంది    పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసుకుంటున్నారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లినాటి ప్రమాణాలు మార్చిపోకుండా.. క్యాన్సర్ తో పోరాడి చనిపోయిన తన భార్యకు కడవరకు తోడు వెళ్లి ఆ బంధాన్ని అందరికి చాటి చెప్పేలా చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నిండు నూరేళ్లు కలిసి జీవించాలనుకున్న  భార్య చనిపోవడంతో ఓ భర్త ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇక భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక పోయాడు. అంతేకాకుండా.. భార్య లేకుండా తనకు ఈ లోకంలో అసలు జీవితమే లేదు అనుకొని చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకి ఏం జరిగిందంటే.. క్యాన్సర్ తో పోరాతున్న భార్యను బతికించుకోలేకపోయనని ఓ ఐపీఎస్ అధికారి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అసోం హోం శాఖ కార్యదర్శి, ఐపీఎస్ శీలాదిత్య చేతియా  భార్య అగమోని బొర్బారుహా (40) చాలా కాలంపాటు కేన్సర్‌తో బాధపడ్డారు. దీంతో తమ స్వస్థలంమైన గువహటిలో తన భార్యకు చికిత్స అందించడమే కాకుండా.. చెన్నైలో కూడా చికిత్స అందించారు. అయిన ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో చేసేదేమి లేక తన భార్యను తిరిగి సొంత గ్రామానికి తీసుకువచ్చి ఆస్పత్రిలో చేర్పించి.. ఉద్యోగంకు సెలువులు పెట్టి నాలుగు నెలలు పాటు కంటికి రెప్పాల కాపాడుకుంటున్నాడు. కానీ, ఇంతలో తన భార్య ఆరోగ్యం మరింత క్షిణించడంతో ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

ఇక డాక్టర్లు తన భార్య మరణ వార్త చెప్పగానే.. ఐసీయూలో ఆమె ఉన్న గదిలోకి వెళ్లిన ఐపీఎస్ అధికారి శీలాదిత్య.. పది నిమిషాలు గడిచాక తన భార్య మృతదేహం వద్ద ప్రార్థన చేసుకోవడం కోసం తనను ఒంటరిగా వదిలేయాలని హాస్పిటల్ సిబ్బందిని కోరారు. అయితే ఐసీయూ నుంచి సిబ్బంది బయటకు వెళ్లిన కాసేపటికే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో వారు పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా.. భార్య డెడ్ బాడీ పక్కనే శీలాదిత్య విగతజీవిగా పడి ఉన్నారు. దీంతో ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు ఎంత  ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని తెలిపారు. ఇక ఈ ఘటనపై నెమ్‌కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హితేశ్ బారువా మాట్లాడుతూ.. శీలాదిత్య భార్య  అగమోనికి రెండు నెలలపాటు మా హాస్పిటల్‌లోనే చికిత్స అందించాం. మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె పరిస్థితి గురించి శీలాదిత్యకు వివరించగా ఆయన అర్థం చేసుకున్నారని అని అనుకున్నాం అని ఆయన తెలిపారు.

ఇకపోతే 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శీలాదిత్య కు 2013లో అగమోనితో వివాహం జరిగింది. కాగా, వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ దంపతులకు సంతానం లేదు. అంతేకాకుండా.. కొద్ది నెలల క్రితం కొద్ది కాలం క్రితమే తల్లి, అత్త మరణించడం.. ఆ విషాదాల నుంచి తేరుకోక ముందే భార్య కూడా కేన్సర్‌తో మరణించడం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు జీ డీజీపీ, ప్రస్తుత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయిన భాస్కర జ్యోతి మహంత తెలిపారు.