iPhone 14 మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 14తో మేడ్ ఇన్ చైనా ఐఫోన్ 14 పోటీ?

సెప్టెంబ‌ర్ లో ఐఫోన్ 14 (iPhone 14)రిలీజ్ కోసం ఆపిల్ స‌న్నాహాలు చేస్తోంది. ఇప్పుడు మేడిన్ ఇండియ‌న్ ఐఫోన్ కూడా రెడీ అవుతోంది. ఆపిల్ 6.1-అంగుళాల ఐఫోన్ 14, 6.1-అంగుళాల ఐఫోన్ 14 ప్రో, 6.7-అంగుళాల ఐఫోన్ 14 మాక్స్, 6.7-అంగుళాల ఐఫోన్ 14 ప్రో మాక్స్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేయాలన్న‌ది ఆపిల్ ప్లాన్. ఇప్ప‌టిదాకా చైనాలో ఆపిల్ ఫోన్ ముందుగా రిలీజ్ అయ్యేది. అక్క‌డ నుంచి వ‌చ్చే ఫోన్ల‌నే ఇత‌ర దేశాల‌కు ఆపిల్ ఎగిమ‌తి చేస్తోంది. ఇప్పుడు ఈ ప‌రిస్థితి మారింది. పాపుల‌ర్ ఐఫోన్ విశ్లేషకుడు మింగ్-చి కువో ఒక ట్వీట్ చేశారు. కొత్త 6.1″ iPhone 14ను మొదటిసారిగా చైనాతో ఏకకాలంలో రవాణా చేస్తుంద‌ని తేల్చేశాడు.

ఐఫోన్ త‌యారీకి కావాల్సిన విడిభాగాలు, అసెంబ్లింగ్ లో చైనాకు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. కాని ఇప్పుడు ఇండియాకూడా మేడిన్ ఇండియా ఐఫోన్ త‌యారీతో చాలా ముందుకెళ్లింది. భారతదేశ ఐఫోన్ త‌యారీ/షిప్‌మెంట్‌ల విష‌యంలో ఇప్పటికీ చైనాతో చాలా గ్యాప్ ఉన్న‌మాట నిజ‌మే. కాని, నాన్ చైనీస్ ఐఫోన్ త‌యారీ కేంద్రం ఇండియాలో నిర్మించ‌డం మాత్రం ఆపిల్ ఆపిల్ సాధించిన గొప్ప విజ‌యం. ఇక్క‌డ నుంచి ఇత‌ర‌దేశాల‌కు ఐఫోన్ ల‌ను పంపించాలంటే, ఇండియాకు అంత సామ‌ర్ధ్యం లేదు. చైనా స‌ముద్ర మార్గాల ద్వారా చాలా వేగంగా స‌ర‌ఫరా చేయ‌గ‌లుగుతుంది. చైనాను ప‌క్క‌న‌పెడితే, మిగిలిన దేశాల‌తో పోలిస్తే మాత్రం ఇండియా చాలా స్ట్రాంగ్. Appleకు ఇండియ‌న్ మార్కెట్ చాలా ముఖ్యం. భవిష్య‌త్తులో ఎక్కువ ఐఫోన్ల‌ను ఇక్క‌డే అమ్మాల‌నుకొంటోంది. ఒక్క‌మాట‌లో ఆపిల్ అమ్మ‌కాల‌కు షోరూమ్ లాంటిది.

ఈ ఏడాది రెండో క్వార్ట‌ర్లో టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియాలో 12 ల‌క్ష‌ల‌కు పైగా ఐఫోన్‌లను విక్రయించింది. అంటే 94 శాతం భారీ వృద్ధి. ఇక మొత్తం ర‌వాణా చేసిన ఐఫోన్ల‌లో దాదాపు 1 మిలియన్ ‘మేక్ ఇన్ ఇండియా ఫోన్లే.

ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ధర ఎంత‌?

ఐఫోన్ 14 ప్రో రేటు $1,099 నుండి ప్రారంభమవుతుంది. అదే ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర $1,199. కాంపోనెంట్ ఖర్చులు పెరుగుతున్నాయి. దానికితోడు Pro , నాన్-ప్రో ఐఫోన్‌ల మ‌ధ్య చాలా తేడాలు చూపించాల‌న్న‌ది Apple సంకల్పం. అందుకే ప్రో రేట్లు ఎక్కువ‌గానే ఉన్నాయి. iPhone 14 Pro, iPhone 14 Pro Max వరుసగా $1099 , $1199 రేంజ్ కి వెళ్లాయి. ఆపిల్ ఐఫోన్ 13 మినీని ప‌క్క‌న‌పెట్టేసింది. మాక్స్ వెర్షన్‌తో భర్తీ చేసింది. అంటే ఐఫోన్స్ లోనే చౌకైన మినీకాస్తా $300 మేర పెర‌గ‌వ‌చ్చు.

Show comments