iDreamPost
android-app
ios-app

ప్రైస్ డ్రాప్: ఐ ఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

ప్రైస్ డ్రాప్: ఐ ఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఐఫోన్.. ఈ కంపెనీ ఫోన్లు, గ్యాడ్జెట్స్ అంటే అందరికీ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా యువతలో ఐఫోన్లు అంటే మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో సైబర్ దాడులు జరగకుండా ఉండాలంటే కూడా మీకు ఐఫోన్ నుంచి భద్రత లభిస్తుంది. ఆ కారణం చేత కూడా ఐఫోన్ ని బాగా వాడుతుంటారు. అంతేకాదండోయ్.. ఐఫోన్ అంటే స్టేటస్ సింబల్ కూడా. కానీ, దానిని కొనాలి అంటే మధ్యతరగతి వారికి కాస్త కష్టంగానే ఉంటుంది.

కానీ, ఇప్పుడు ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది. వంద కాదు.. వెయ్యి కాదు.. వేలల్లో ధర తగ్గిస్తున్నారు. ఈ ఆఫర్ కేవలం రెండ్రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ని ఇస్తోంది మరెవరో కాదు.. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్. ఆ సంస్థ ఈ నెల 15-16 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో ఐఫోన్ 14పై ప్రత్యేకంగా డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాకుండా.. బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అసలు ఐఫోన్ 14 ఎంత ధరకు వస్తుందో చూడండి.

ఈ ప్రైస్ డ్రాప్ ఐఫోన్ 14 128 జీబీ వేరియంట్ పై అందిస్తున్నారు. దీని ధర ఇండియాలో రూ.79,900గా ఉంది. అయితే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ ఫోన్ ని మీరు కేవలం రూ.66,499కే పొందవచ్చు. అంతేకాకుండా.. మీరు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు కస్టమర్స్ అయితే మీకు అదనంగా 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం జులై 15, 16 తారీఖుల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ డిస్కౌంట్ ని వాడేసుకుని మీరు కూడా ఒక ఐఫోన్ కి ఓనర్ అయిపోండి.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్స్:

ఈ ఫోన్ 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తోంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ దీని సొంతం. ఈ ఐఫోన్ 14 మోడల్ ఏ15 బయోనిక్ చిప్ తో వస్తోంది. సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, డాల్బీ విజన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంక కెమెరా విషయానికి వస్తే.. 12 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఫ్రంట్ 12 ఎంపీ ట్రూ డెప్త్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలతో ఎంతో క్వాలిటీతో మీరు ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ ఐఫోన్ 14లో వీడియో స్టెబిలిటీ, లో లైట్ పర్ఫార్మెన్స్ మరింత మెరుగు పరిచారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş