iDreamPost
ఇంత హింస, అసభ్యత ఉన్న చిత్రాన్ని చూడాల్సి రావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాక తమ ప్రమాణాలకు తగ్గట్టు లేదని బహిరంగ వేదిక మీద చెప్పడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ది కాశ్మీర్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్.
ఇంత హింస, అసభ్యత ఉన్న చిత్రాన్ని చూడాల్సి రావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాక తమ ప్రమాణాలకు తగ్గట్టు లేదని బహిరంగ వేదిక మీద చెప్పడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ది కాశ్మీర్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్.
iDreamPost
నిన్న జరిగిన గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాలో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మీద జ్యురి హెడ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారి తీస్తున్నాయి. ఇంత హింస, అసభ్యత ఉన్న చిత్రాన్ని చూడాల్సి రావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాక తమ ప్రమాణాలకు తగ్గట్టు లేదని బహిరంగ వేదిక మీద చెప్పడం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ది కాశ్మీర్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్. స్టార్ క్యాస్టింగ్ లేకుండా ఈ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేయడం చూసి తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఇప్పుడీ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పరాభవం
కాశ్మీర్ లోయలో 1990లో జరిగిన పండిట్ల ఊచకోత మీద తీసిన ఈ సినిమా మీద ప్రేక్షకుల మద్దతు ఎంతగా దక్కినా అందులో ఇష్యూని తెరకెక్కించిన తీరు మీద విమర్శలూ వచ్చాయి. ఒక కోణం వైపే చూపించారని, సరైన పరిశోధన చేసి లోతుగా అధ్యయనం చేసి ఉంటే ఇంకా వాస్తవాలను చూపించేవారని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. కానీ థియేటర్లలో మాత్రం దీనికి విపరీతమైన ఆదరణ దక్కింది. షో అయ్యాక జనం లేచి నిలబడి జనగణమన గీతం పాడటం, కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి రావడం లాంటి దృశ్యాలు ఎన్నో చోట్ల కనిపించాయి. కానీ ఓటిటిలో వచ్చాక ఆ స్థాయి స్పందన కనిపించకపోవడం మాత్రం విచిత్రం. ఇప్పుడిలా జరగడం మరో ట్విస్టు.
ఏది ఏమైనా ది కాశ్మీర్ ఫైల్స్ ప్రజామోదం పొందిన చిత్రం. ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం మెజారిటీ ప్రజలకు నచ్చింది కాబట్టే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు దాన్ని తీసిపారేసేలా మాట్లాడ్డం వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. అభిప్రాయాలు ఎవరైనా వ్యక్తం చేయొచ్చు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇంకా దీనికి సంబంధించి పూర్తిగా స్పందించలేదు. ముఖ్యంగా బిజెపి ఎజెండాతో ఈ సినిమా తీశారన్న కామెంట్ల మీద ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వచ్చిన వివేక్ ఇప్పడేమంటారో చూడాలి. మొత్తానికి గోవా ఫెస్టివల్ పుణ్యమాని అందరూ మర్చిపోతున్న టైంలో ది కాశ్మీర్ ఫైల్స్ మళ్ళీ కొత్త గొడవతో తెరమీదకు వచ్చింది. మరి ఎక్కడి దాకా వెళ్తుందో