iDreamPost
android-app
ios-app

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఎర్పాటుతో ఏపీలో భారీగా ఉద్యోగాల కల్పన: సీఎం జగన్‌

  • Published Sep 05, 2022 | 6:16 PM Updated Updated Sep 05, 2022 | 6:16 PM
గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఎర్పాటుతో ఏపీలో భారీగా ఉద్యోగాల కల్పన: సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన‌ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్‌ఐపీబీ) సమావేశంలో రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ ఏమ‌న్నారంటే, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు ఏపీ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల వ‌ల్ల పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. క్లీన్‌ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డ‌బ్బు అందుతుంది. దీనివల్ల ఆదాయాలు కూడా పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం పెద్ద ఎత్తున సంస్థలు రాష్ట్రానికి వ‌స్తాయి.

ఏపీలో కొత్త ఎర్పాటుకానున్న కంపెనీలు ఇవే

– వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో కాసిస్‌ ఇ–మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ
-పెట్టుబడి రూ. 386.23 కోట్లు –
-ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీకోసం రూ. 286.23 కోట్లు, ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి.
-ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ లక్ష్యం.
-1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు.
-కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో లైఫిజ్‌ ఫార్మా యూనిట్
-పెట్టుబ‌డి రూ.1900 కోట్లు.
-2వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవ‌కాశాలు
-ఏప్రిల్‌ 2024 నాటికి కంపెనీ సిద్ధం
-ల‌క్ష్యం.. ఏపీఐ డ్రగ్‌ తయారీలో చైనా దిగుమతులపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించడం.
-పరిశ్రమ కోసం 236.37 ఎకరాల సేక‌ర‌ణ‌.

-మెటలార్జికల్‌ గ్రేడ్‌ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్‌, రోల్డ్‌ గ్లాసెస్‌ తయారీ కోసం పరిశ్రమ, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టును ఎర్పాటు చేయ‌నున్న ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ .
-కంపెనీ, ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
-మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి.
-11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేలమందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు.
-నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ,
-50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ఎర్పాటు.

-కృష్ణా జిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్న అవిశా ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ .
-పెట్టుబ‌డి, రూ. 150 కోట్లు.
-2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగా అవ‌కాశాలు.
-11.64 ఎకరాల భూమి కేటాయింపు.
-2023 మార్చి నాటికి పూర్తిచేసేందుకు ప్రణాళికలు.

-వైఎస్సార్‌ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్‌ హైడ్రో, సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఎర్పాటుచేయ‌నున్న‌ ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.
-7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033కోట్ల వ్య‌యం.
-పైడిపాలెం ఈస్ట్‌ 1200 మెగావాట్లు, నార్త్‌ 1000 మెగావాట్లు, 3500 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటు.
-7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి.
-డిసెంబర్‌ 2028 నాటికి పూర్తిచేయాలన్న‌ది లక్ష్యం.

-కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్.
-రూ. 5వేల కోట్ల పెట్టుబడి
-వేయి మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు
-700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటు.
-మార్చి 2025 నాటికి ప్రాజెక్టుల పూర్తిచేయాలన్న‌ది లక్ష్యం.

– ఆరు గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకూ ఎస్‌ఐపీబీ ఆమోదం.
– ఈ ఆరు ప్రాజెక్టుల కోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి.
– 20,130 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన.