iDreamPost
iDreamPost
ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రమేష్ కుమార్ ప్రకటించారు. దాంతో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలతో పాటుగా పంచాయితీ పోరు కూడా వాయిదా పడింది.
ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఎస్ ఈ సీ ప్రకటించింది. దాంతో మే మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత తేదీలు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయిన వారందరూ యధావిధిగా కొనసాగుతారన్నది ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. కరోనా విస్తృతమవుతున్న సమయంలో ఎన్నికల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడితే నష్టం జరిగే అవకాశం ఉన్నందును ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ రద్దు చేయడం లేదని ఎస్ ఈ సీ తెలిపింది. అత్యున్నత కమిటీ నిర్ణయం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. దాంతో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో యధావిధిగా కొనసాగడం అనివార్యం అని చెప్పవచ్చు.