iDreamPost
android-app
ios-app

ఏబీఎన్‌లో ఆగిన మండలి ప్రసారాలు

ఏబీఎన్‌లో ఆగిన మండలి ప్రసారాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ప్రసారాలు ఏబీఎన్‌లో ఆగాయి. చానెల్‌తోపాటు, ఏబీఎన్‌ యూట్యూబ్‌ చానెల్‌లో కూడా ఆగాయి. అజ్ఞాత వ్యక్తులెవరో మండలి ప్రసారాలను అక్కడ ఏర్పాటు చేసిన మోనిటర్‌ ద్వారా ఫేస్‌బుక్‌ పేజీ లో లైవ్‌ ఇస్తుండగా.. దాన్ని ఏబీఎన్‌ తన చానెల్, యూట్యూబ్‌ చానెల్‌లో లైవ్‌ ప్రసారం ఇస్తోంది.

దాదాపు గంట నుంచి ప్రసారం జరుగుతుండగా.. ఇప్పుడు అధికారులు గుర్తించారు. గ్యాలరీలో కూర్చుని ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకున్నారు. మీరు ఎవరు..? లైవ్‌ ఎందుకు ఇస్తున్నారు..? అంటూ వారిరువురి మధ్య వినపడీ.. వినపడనట్లుగా సంభాషణ జరిగింది. ఇది జరిగిన రెండు నిమిషాలకే ఏబీఎన్‌ యూట్యూబ్‌ చానెల్‌లో లైవ్‌ ఆగిపోయింది. అయితే టీడీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో మాత్రం ఇంకా లైవ్‌ కొనసాగుతోంది. అంటే గ్యాలరీలో ఉండే వ్యక్తులెవరో మండలి సమావేశాలను టీడీపీ అధికారిక ఫేస్‌బుక్‌లో లైవ్‌ ఇస్తున్నారు.

Read Also: మండలి లైవ్ ప్రసారాలు.. ఏబీఎన్ కే ఎలా సాధ్యం..?

కాగా, సాంకేతిక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సమావేశాలు లైవ్‌ ప్రసారం కావడంలేదు. ఈ విషయంపై ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన చేసింది. నిన్న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ సమస్య నెలకొంది. సమస్యను పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా ప్రకటించారు.