Idream media
Idream media
ప్రభుత్వ భూముల అమ్మకాలపై కూడా ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంది. ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు… ఇతర ఆదాయ మార్గాలున్నా వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రభుత్వ తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితిలో ఉందా..? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. భవిష్యత్‌లో భూములు అవసరమైతే ఏమి చేస్తారని అడిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న ఏపీ హైకోర్టు.. ప్రభుత్వ భూముల వ్యవహారంలోనూ ఇదే వైఖరిని కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియం, ప్రభుత్వ భవనాలకు రంగులు.. ఇలా పలు అంశాల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పులు, ఆదేశాలు వెలువరించింది.