iDreamPost
iDreamPost
జగన్ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించింది. జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. ఆవేశంలో చేసిన వివిధ నేరాల నుంచి తప్పు తెలుసుకుని పరివర్తన పొందిన మహిళా ఖైదీలకు విముక్తి లభించింది. ఏపీలోని వివిధ సెంట్రల్ జైళ్ల నుంచి 53 మంది విడుదలయ్యారు. జైలు సంస్కరణలలో భాగంగా పలు అంశాల్లో శిక్షణ పొందిన ఖైదీలు బయట ప్రపంచంలోకి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అనుగుణంగా తలుపులు తెరిచింది.
విశాఖ, రాజమహేంద్రవరం, నెల్లూరు సెంట్రల్ జైళ్ల నుంచి మహిళా ఖైదీలు బయటకు వచ్చారు. వారికి నిబంధనలతో కూడిన బహిరంగ జీవనానికి జైళ్ల శాఖ అనుమతినిచ్చింది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి పోలీసుల ముందు హాజరయ్యి, నిబద్దతో సాధారణ జీవనం గడిపేందుకు అనుమతి దక్కింది. దాంతో సుదీర్ఘకాలంగా జైళ్లలో మగ్గిన వారు మళ్లీ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు.
జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మొట్టమొదటిసారిగా మహిళా జీవిత ఖైదీల జీవిత శిక్ష నుంచి ఐదేళ్ల కి కుదించారు. దాంతో 53 మందికి విముక్తి లభించింది. రాజమహేంద్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన మహిళా జీవిత ఖైదీలకు ఎంపీ మార్గాని భరత్ అభినందనలు తెలిపారు. వారికి నిత్యవసర వస్తువులు… ప్రయాణ ఛార్జీలు…కొత్త దుస్తులను మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ తనయుడు, వైఎస్సార్ సీపీ యువ నాయకుడు చందన నాగేశ్వర్ తో కలిసి అందించారు. ఇకపై సాధారణ జీవనం గడుపుతూ కుటుంబాల్లో వెలుగులు నింపుకోవాలని సూచించారు.