iDreamPost
iDreamPost
తునిలో తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మరోమారు మంచి మనసును చాటుకున్నారు. జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ తల్లిని చూశారు. కాన్వాయ్‌ను ఆపించి కిందకు దిగారు. ఆ బాబుతో సహా తల్లిని దగ్గరకు పిలిపించుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకుని, ఆమె కష్టానికి చలించిపోయారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజకు, ఓ కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డకి అనారోగ్యం. నడవలేడు. సాయం కోసం ఆమె సీఎం జగన్‌ను కలవాలని ఆ బిడ్డను తీసుకొని వచ్చింది. బిడ్డను ఎత్తుకొని, సీఎం కాన్వాయ్‌కు కనిపించేలా ప్రయత్నించింది. అది గమనించిన సీఎం జగన్, కాన్వాయ్‌ను ఆపించారు. ఆ తల్లీబిడ్డలను పిలిపించుకుని సమస్య తెలుసుకున్నారు. అప్పటికప్పుడు వెంటనే స్పందించారు.
తన బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని సీఎం జగన్‌కు తనూజ వివరించింది. కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని ఆదేశించి, అప్పటికప్పుడే ఆమెకు సాయం అందేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. శభాష్ అనిపించారు.