iDreamPost
iDreamPost
కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార్థులు ఏ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ కు తీసిపోరు. అమెరికన్న స్టైల్ లో వాళ్లకన్నా సూపర్ గా మాట్లాడతారు. స్కూలుకెళ్తే, ఏదో విదేశీ స్కూల్ కి వెళ్లిన ఫీలింగ్. ప్రభుత్వ పాఠశాల పిల్లలేంటి? ఈ ఇంగ్లీష్ ఏంటి? ఇలా ఇంగ్లిష్‌లో మాట్లాడడం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయ్యింది. ఇంగ్లిష్‌పై బెండపూడి విద్యార్ధుల పట్టును చూసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రప్పించుకుని ఆ విద్యార్థులతో ముచ్చటించారు.
వాళ్లతో సీఎం జగన్ సంభాషణ అంతా ఇంగ్లీషులోనే సాగింది. వాళ్ల ప్రతిభను మెచ్చుకున్న సీఎం ఉన్నత శిఖరాలను అందుకోవాలని దీవించారు.
స్టూడెంట్ మేఘన తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ. 929 సీఎం జగన్‌కు ఇచ్చింది. కేవలం రూ.19 మాత్రమే తీసుకుని మిగతా డబ్బును ఆమెకే ఇచ్చారు సీఎం జగన్. ఈ దృశ్యం అక్కడున్నవాళ్లను ఆకట్టుకుంది.
ఈ విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటం వెనుక ఉన్న ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
తాను తెలుగు మీడియం విద్యార్థిని. అందుకే తన విద్యార్ధులెవ్వరికీ ఇంగ్లిష్‌పరంగా ఇబ్బందులు ఎదురు కాకుండా బోధించానని, అందుకే ఆంగ్ల భాషపై పట్టు వచ్చిందని ప్రభుత్వ టీచర్ చెప్పారు.